Health Benefits : ఈ నాలుగు ఆకులు చాలు… బ్లడ్, లివర్ క్లీన్ అయిపోతాయి…
Health Benefits : మునగకాయతోపాటు మునగాకు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వలన మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఈ ఆకులో నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల లో కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం, అలాగే మునగాకులో క్యాల్షియం, ప్రోటీన్స్, ఐరన్, అమైనో యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని నయం చేయడానికి, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మునగాకు ద్రవం వాపు, ఎరుపు, నొప్పిని తగ్గిస్తుంది. మునగ చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలను ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. మునగాకు తినడం వలన మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మునగాకు విటమిన్ ఎ ను కలిగి ఉంటుంది.
ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మునగాకు పాంక్రియస్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. పాంక్రియాస్ ను ఉత్పత్తి చేయడానికి బీటా కణాలు ఉంటాయి. బయటి ఆహార పదార్థాలను తినడం వలన ఫ్రీ రాడికల్స్ ఎక్కువ మొత్తంలో శరీరంలో చేరుకుంటాయి. ఫ్రీ రాడికల్స్ బీటాకణాలను నాశనం చేసి పాంక్రియస్ ను దెబ్బతీస్తాయి. బీటా కణాలు నాశనం అవడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. దీని వలన పాంక్రియస్ దెబ్బతింటుంది. అయితే ఈ మునగాకు బీటా కణాలు నాశనం కాకుండా రక్షించి వాటి లైఫ్ టైం ను పెంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తాయి. మునగాకులో క్లోరోజేనిక్ యాసిడ్, ఐసోథియో సైనైట్స్ ఉండడం వలన ఈ రెండు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించి గ్లూకోజ్ ను తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో కణాల్లోని కి వెళ్లేలా చేస్తాయి. ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ రక్తం లోకి చేరుతుంది.

Health Benefits of Drumstick leaves clean the blood and liver in our body
గ్లూకోజ్ ఎక్కువ మొత్తంలో రక్తంలో ఉండడం వలన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీనిని షుగర్ వ్యాధి అంటారు. రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను రక్త కణాలలో వెళ్లే లాగా చేయడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది. గ్లూకోస్ కణాలు లోపలికి వెళ్లే లాగా చేయడంలో మునగాకు సహాయపడుతుంది. మునగాకులో ఉండే కాంపౌండ్స్ రక్తంలోకి తక్కువ గ్లూకోస్ ఎక్కువ ఇన్సులిన్ పంపేటట్లు చేస్తుంది. అలాగే మునగాకులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం తిన్నప్పుడు ప్రేగులలో గ్లూకోజ్ గ్రహించడానికి, నియంత్రణలో ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అందువలన మునగాకును రోజుకు 50 గ్రాములు అయినా తినాలి. ఇలా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. ఇప్పుడు అంగడిలో మునగాకు బాగా దొరుకుతుంది. కావున ప్రతిరోజు మునగాకును తీసుకోవడం మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు మునగాకును తినడం మంచిది. మిగిలిన ఆకుకూరలకంటే ఈ మునగాకు రక్తంలో చక్కెర స్థాయిని పెరగకుండా చేస్తుంది.