Health Benefits : ఆఫీస్ టైం లో ఆకలి వేస్తుందా… అయితే ఇవి తినండి…
Health Benefits : మనం తరచుగా ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతాం అని చాలామంది అంటుంటారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఆకలి వేసినప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి తినాలి. అయితే ఎటువంటి ఆహారం తీసుకుంటారనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఆఫీసులో మనం వర్క్ లో ఉన్నప్పుడు మధ్యలో ఆకలిగా అనిపిస్తుంటుంది. తినడానికి బయటకి వెళ్లలేని పరిస్థితిలో ఆరోగ్య నిపుణులు సూచించిన దాని ప్రకారం ఈ స్నాక్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇవి కడుపునిండుగా ఉంచడమే కాకుండా శరీరం బరువు పెరగకుండా చూస్తుంది. ఇవి తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కనుక వైద్యులు సూచించిన దాని ప్రకారం ఇలాంటివి తినాలి.
ఆఫీస్ టైం లో ఆకలి వేసినప్పుడు బాదం పప్పులను తినడం ఉత్తమం. బాదం లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బాదం లోని ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. అలాగే బాదంపప్పుతో పాటు ఇంకొక చిరు తిండి ఏంటంటే పాప్ కార్న్. పాప్ కార్న్ లో మంచి ఫైబర్ ఉంటుంది. పాప్కార్న్ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఆఫీస్ టైం లో ఆకలి వేసినప్పుడు చిప్స్ లాంటివి, ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఇలాంటి ప్రోటీన్స్ ఫైబర్ కలిగిన బాదం పప్పులను తింటే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆకలి కూడా వేయదు.
మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే రుచిగా కూడా ఉంటాయి. మొలకల్లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఇవి మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆఫీస్ టైం లో ఆకలిగా ఉంటే తినడానికి ఓట్స్ కూడా చాలా మంచివి. ఇవి ఆరోగ్యకరమైనవే కాకుండా రుచిగా కూడా ఉంటాయి. ఓట్స్ తో పాటు ఆహారంలో ఫ్రూట్స్ ను కూడా చేర్చుకోవచ్చు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వలన కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఆఫీస్ టైంలో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.