క‌రోనా అని గుడ్లు అధికంగా తింటున్నారా… అయితే ఇది త‌ప్ప‌క చ‌ద‌వండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

క‌రోనా అని గుడ్లు అధికంగా తింటున్నారా… అయితే ఇది త‌ప్ప‌క చ‌ద‌వండి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 May 2021,9:30 pm

క‌రోనా అని గుడ్లను అధికంగా తింటే ఏమౌతుంది.. అస‌లు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి… గుడ్డును ఎంత సేపు ఉడికించాలి… ఆదివారమైనా.. సోమవారమైనా.. రోజూ తినండి గుడ్డు.. అంటూ టీవీ యాడ్స్ లో చూస్తూనే ఉంటాం కదా. మరి నిజంగానే రోజూ గుడ్డు తినాలా? గుడ్డును ఉడకబెట్టి తినాలా? లేక కూర వండుకొని తినాలా? లేదంటే ఆమ్లెట్ వేసుకొని తినాలా? ఈ క‌రోనా టైమ్ లో గుడ్లు చాలా అధికంగా తింటున్నారు. దీని వ‌ల్ల లాభ‌మా… న‌ష్ట‌మా… అసలు వరుసగా రోజూ గుడ్లు ఉడకబెట్టుకొని తింటే ఏమౌతుంది… అసలు గుడ్డు నిజంగా మన ఆరోగ్యానికి మంచిదేనా? ఇలా.. ఎన్నో రకాల డౌట్స్ మనకు వస్తుంటాయి

అసలు.. గుడ్డులో ఉండే పోషకాలు ఏంటి..?

కోడి గుడ్డులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పచ్చ సొన, ఇంకోటి తెల్ల సొన. అయితే.. కొందరేమో పచ్చ సొన తినాలి అంటారు.. ఇంకొకరు తెల్ల సొన తినాలి అంటారు. ఇంకొందరు మాత్రం ఏదీ తినొద్దు అంటారు. మరికొందరు రెండూ తినాలి అంటారు. అసలు ఒక్క రోజుల్లో ఎన్ని గుడ్లు తినాలి. అసలు.. గుడ్డులో ఉండే పోషకాలు ఏంటి? అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు.. కోడి గుడ్డులో ఎన్ని రకాల పోషకాలు, ఉంటాయో ముందు తెలుసుకుందాం. ఉడకబెట్టిన ఒక్క కోడిగుడ్డో 80 కేలరీలు ఉంటాయి. కోడిగుడ్డులో విటమిన్ డీ, ఈ, కెరోటిన్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. కోడిగుడ్డులో 300 మైక్రో గ్రాముల కోలిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. ఒక్క గుడ్డులోనే ఇన్ని పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలు బలంగా తయారయ్యేలా సహకరిస్తాయి. కంటి శుక్లాలను రాకుండా కాపాడుతాయి. కండరాలు గట్టిపడేందుకు దోహదం చేస్తాయి.

Health Benefits of Eggs

Health Benefits of Eggs

రొమ్ము క్యాన్సర్, ఎనీమియా, ఇతర క్యాన్సర్లకు కారణమయ్యే కణాలను కోడి గుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశింపజేస్తాయి. చూశారు కదా.. ఒక్క ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఎన్ని పోషకాలు ఉన్నాయో.. అందుకే.. రోజూ ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. రోజూ ఒకటి లేదా రెండు ఉడకబెట్టిన గుడ్లను మాత్రం తీసుకోవాలట. కాకపోతే.. దానికంటే ముందు తేలుసుకోవ‌ల‌సిన విష‌యం మ‌రోక‌టి ఉంది ,అది ఏమిటి అంటే అస‌లు గుడ్డుని ఏంత‌సేపు ఉడికించుకోవాలి…

సాదార్ణంగా ఒక గుడ్డుని 13నీమిషాల వ‌ర‌కు ఉడికించుకోవాలి, భాగా మంట‌ను హైలో పేటుకుంటే 9నీమిషాల వ‌ర‌కు ఉడికించుకుంటే చాలు… ఎందుకంటే తేల్ల‌సోన‌ 82 డీగ్రి సేంటి గ్రేడ్ వ‌ర‌కు… పచ్ఛ‌సోన‌ 76 డీగ్రి సేంటి గ్రేడ్ వ‌ర‌కు ఉడికించుకోవాలి.. ఇలా ఉడికించుకుంటేనే గుడ్డు పూర్తిగా ఉడుకుతుంది. ఉడికించిన గుడ్ల‌ను మ‌నం 2 లేదా 3 గంట‌ల‌లో తినాలి … మిగిలిపోయాయి క‌దా అని ప్రీజ్ లో ఉంచి మ‌రుస‌టి రోజు తిన‌కోడ‌దు… ఎందుకంటే అలా ఉంచిన గుడ్డుపైన భ్యాక్టిరియాలు, వైర‌స్ లు చేరుతాయి … బ్యాడ్ స్మేల్ కూడా వ‌స్తుంది.. అది మ‌న‌కు తేలుసు, అల‌గే షుగ‌ర్ ఉన్న‌వాలు కోడి గుడ్డును ఎలా తినాలి అంటే, గుడ్డును లోప‌లి సోన తిసి పైన ఉన్న తేల్ల సోన‌ని వారానికి 2 మాత్ర‌మే తినాలి… ఎక్కువ‌గా తిన‌వ‌ద్దు, ఆంబులేట్ రూపంలో అటే వారానికి 1 సారి మాత్ర‌మే తిసుకోవాలి , షుగ‌ర్ ఉన్న వారు అస‌లు తిసుకొక‌పోవ‌డ‌మే మంచిది, వీలైనంత వ‌ర‌కు ఉడికించిన గుడ్ల‌ల‌ను తినండి..

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది