Health Benefits : శిలాజిత్తుతో ఇన్ని లాభాలా…! ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారికి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : శిలాజిత్తుతో ఇన్ని లాభాలా…! ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారికి…

Health Benefits : శిలాజిత్తు అనేది హిమాలయాలలో దొరికే సహజ సిద్ధమైన నల్ల రంగు ఖనిజం. శిలాజిత్ తీసుకోవడం వలన పురుషులకు చాలా లాభాలు ఉన్నాయి. ఇది పురుషుల హార్మోన్లను ప్రోత్సహిస్తుంది. లైంగిక సమస్యలతో సహా అనేక వ్యాధుల నిర్మూలనకు శిలాజిత్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మధుమేహం, ఆల్జీమర్స్ తగ్గించడంలో ఇది ప్రభావంతమైనదిగా పరిగణించబడుతుంది. శిలాజిత్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేద ప్రకారం శిలాజిత్తులో 85 ఖనిజాలు ఉంటాయి. పురుషులకు అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేదం అంటుంది. ఇది […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 October 2022,5:00 pm

Health Benefits : శిలాజిత్తు అనేది హిమాలయాలలో దొరికే సహజ సిద్ధమైన నల్ల రంగు ఖనిజం. శిలాజిత్ తీసుకోవడం వలన పురుషులకు చాలా లాభాలు ఉన్నాయి. ఇది పురుషుల హార్మోన్లను ప్రోత్సహిస్తుంది. లైంగిక సమస్యలతో సహా అనేక వ్యాధుల నిర్మూలనకు శిలాజిత్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మధుమేహం, ఆల్జీమర్స్ తగ్గించడంలో ఇది ప్రభావంతమైనదిగా పరిగణించబడుతుంది. శిలాజిత్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేద ప్రకారం శిలాజిత్తులో 85 ఖనిజాలు ఉంటాయి. పురుషులకు అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేదం అంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

శిలాజిత్ అనేది మందపాటి గోధుమ రంగులో జికటగా ఉంటుంది. ఇది హిమాలయ శిలల నుంచి తీసుకొస్తుంటారు. దీని రంగు తెలుపు నుంచి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా శిలాజిత్ వేసి వినియోగిస్తారు. ఇది చాలా ప్రభావవంతమైనది సురక్షితమైనది. ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తక్కువ టెస్టోస్టిరాన్, అల్జీమర్స్ వ్యాధి, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, మగ సంతానోత్పత్తి లేదా గుండెకు శిలాజిత్ ప్రయోజనకరంగా ఉంటుంది.

Health benefits of Himalayan shilajit

Health benefits of Himalayan shilajit

భారత్, నేపాల్, పాకిస్తాన్, టిబెట్ వంటి ఏడు దేశాలలో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల నుంచి దీనిని తీసుకొస్తారు. మే, జూన్ నెలల్లో మండే వేడి నుంచి శిలాజిత్ బయటకు వస్తుంది. శిలాజిత్ ఒక ఆయుర్వేద మూలిక. దీనిని తీసుకోవడం వలన పురుషుల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. పురుషులకి శిలాజిత్ చాలా ఆరోగ్యకరమైనది. శిలాజిత్ తీసుకోవడం వలన పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ స్థాయిని పెంచవచ్చు. పురుషుల కండరాలు మెరుగైన రీతిలో అభివృద్ధి చెందుతాయి. శారీరక సామర్థ్యాన్ని పెరుగుపరచడానికి శిలాజిత్ తినాలని వైద్యులు సూచించారు. ఆయుర్వేద ప్రకారం శిలాజిత్తును ఆవుపాలతో కలిపి సేవించాలి. ఇది సంతానాలేమి సమస్యలను దూరం చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది