Jilledu Plant : ఈ మొక్కతో ఇన్ని లాభాలా… ఎక్కడ ఉన్న ఇంటికి తెచ్చుకుంటారు…!
ప్రధానాంశాలు:
Jilledu Plant : ఈ మొక్కతో ఇన్ని లాభాలా... ఎక్కడ ఉన్న ఇంటికి తెచ్చుకుంటారు...!
Jilledu Plant : ఆయుర్వేదంలో ఎన్నో మొక్కల్ని ఎన్నో వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కల్ని పలు అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ఒక రకంగా చెప్పాలి అంటే వరం లాంటివి. వీటిల్లోకి జిల్లేడు మొక్క కూడా ఒకటి చేరుతుంది. సాధారణంగా ఈ మొక్కల్ని పూజలు చేసేందుకు మాత్రమే వాడతారు. కానీ ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు కూడా వాడుతూ ఉంటారు. కీళ్ల నొప్పులు, దంత సమస్యలు, విరోచనాలు, మలబద్ధకం లాంటి వాటి నుండి కూడా రక్షిస్తుంది. దీనిలో ఇలాంటి ఇన్ ప్లమెంటరీ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు ఉన్నాయి. ఇవి గాయాలను తొందరగా నయం చేయటానికి కూడా ఎంతో యూజ్ అవుతుంది. ఈ మొక్కతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
తలనొప్పి : తలనొప్పిని తగ్గించటంలో జిల్లేడు మొక్క ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు జిల్లేడు ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని, దీని పేస్ట్ ని నుదుటిపై గనక రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండటం వలన తలనొప్పి, వాపు, ఎరుపు, చికాకు అనేవి తగ్గుతాయి…
Jilledu Plant చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి
చర్మ పై దురదలు రావడం, తామర లాంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఈ జిల్లేడు ఆకు బాగా పని చేస్తుంది. జిల్లేడు ఆకులు పేస్ట్ ను మీకు దురద, తామర వచ్చిన ప్రదేశంలో రాసుకోండి. అంతేకాక ఎన్నో రకాల చర్మ ఇన్ఫెక్షన్ లు పెరగకుండా కూడా ఎంతో మేలు చేస్తుంది…
Jilledu Plant ఫైల్స్ తగ్గుతాయి
ఫైల్స్ సమస్యకి కూడా జిల్లేడు చెట్టు ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. జిల్లేడు చెట్టు ఆకుల్ని పేస్ట్ లా చేసి ఫైల్స్ గాయాలపై తరచుగా పెట్టాలి. ఇలా చేయటం వలన గాయం అనేది తొందరగా మానుతుంది. నొప్పి నుండి కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది.
Jilledu Plant : కీళ్ల నొప్పులు తగ్గుతాయి
చాలా మందిలో కీళ్ల నొప్పులు అనేవి సాధారణం గా ఉండే సమస్య. కీళ్ల నొప్పులు అంత తొందరగా తగ్గవు. అందులో పెద్దవారిలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి వారు ఎక్కువ ఖర్చు పెట్టి మందులు వాడటం కన్నా, జిల్లేడు ఆకుల నుండి తీసిన రసాన్ని గనక తరచు పూస్తూ ఉన్నట్లయితే తొందరగా ఉపశమనం లభిస్తుంది…