Lemon : నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు… ఎలా వాడాలంటే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lemon : నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు… ఎలా వాడాలంటే…??

 Authored By ramu | The Telugu News | Updated on :15 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Lemon : నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు... ఎలా వాడాలంటే...??

Lemon : మనకు పకృతి ఇచ్చిన గొప్ప వరాలలో నిమ్మ కాయ కూడా ఒకటి. అయితే మనకు సహజంగా లభించే నిమ్మకాయల్లో ఎన్నో లాభాలు ఉన్నాయి అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జీర్ణ సమస్యల కు మాత్రమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అందుకే ప్రతిరోజు నిమ్మకాయను తీసుకోవాలి అని అంటుంటారు. అయితే కేవలం నిమ్మకాయను మాత్రమే కాకుండా నిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి అనే సంగతి మీకు తెలుసా. అయితే ఈ నిమ్మ ఆకులను ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

– నిమ్మ ఆకులు అనేవి బీపీని కంట్రోల్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ నిమ్మ ఆకులతో హెర్బల్ టీ ని తయారు చేసుకొని తాగడం వలన రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లు అనేవి బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి…

– అలాగే చర్మ సమస్యలను దూరం చేయటం లో కూడా ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ ఆకులతో తయారు చేసిన టీ ని తాగటం వలన చర్మ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు…

– డయాబెటిస్ తో ఇబ్బంది పడే వారికి కూడా ఈ నిమ్మ ఆకులు అనేవి ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఈ నిమ్మ ఆకులతో చేసిన టీ ని తాగడం వలన షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. దీనిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి…

– జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కూడా నిమ్మ ఆకుల టీ ఎంతో బాగా సహాయపడుతుంది. అయితే ఈ ఆకులను వేడి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగాలి. ఇలా చేయటం వలన జీర్ణశక్తి అనేది ఎంతగానో మెరుగుపడుతుంది. అంతేకాక ఇవి శరీరానికి ఎంతో అవసరమైన ఘట్ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది.

Lemon నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఎలా వాడాలంటే

Lemon : నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు… ఎలా వాడాలంటే…??

– ఈ నిమ్మ ఆకులను మజ్జిగలో కలిపి తాగటం వలన కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. దీని వలన జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అని అంటున్నారు…

– చర్మంపై వచ్చే దద్దుర్లు మరియు మొటిమలను కూడా ఈ నిమ్మ ఆకులతో నయం చేయొచ్చు. దీని కోసం నిమ్మ ఆకులను లేపనంలా చేసి చర్మంపై అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వలన నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయి…

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది