Lotus Tea : ప్రతిరోజు తామర పూల టీ తాగటం వలన కలిగే ముఖ్య లాభాలు ఏమిటో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lotus Tea : ప్రతిరోజు తామర పూల టీ తాగటం వలన కలిగే ముఖ్య లాభాలు ఏమిటో తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :9 November 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Lotus Tea : ప్రతిరోజు తామర పూల టీ తాగటం వలన కలిగే ముఖ్య లాభాలు ఏమిటో తెలుసా...!

Lotus Tea : ఆయుర్వేద ప్రకారం తామర పువ్వు టీ ఉత్తమ ఔషధంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ తామర పువ్వులో ఉండే విటమిన్ బి సి, ఐరన్ లాంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచటం ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే కార్డియాక్ అరెస్ట్ గుండెకు సంబంధించినటువంటి సమస్యలలో తామర పూవ్వు టీ అనేది టానిక్ గా పని చేస్తుంది అని డాక్టర్ భావ్సర్ తెలిపారు. ఈ తామర పువ్వుతో తయారు చేసినటువంటి టీని తీసుకోవటం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే ఈ టీ ని గనక మీరు నిత్యం కచ్చితంగా తీసుకుంటే హై బీపీ సమస్య కూడా ఈజీగా తగ్గిపోతుంది. అయితే లోబీపీ సమస్యతో ఇబ్బంది పడే వారు మాత్రమే వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ టీ ని తీసుకోవాలి.

ఈ తామర పువ్వు లో ఉన్నటువంటి అపోమోర్పిన్ మరియు న్యూసిఫెరిన్ అనే పోషకాలు ఒత్తిడి మరియు ఆందోళన,నిరాశ లాంటి సమస్యలను ఎదుర్కోవటంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ తామర పువ్వుల టీ ని నిత్యం కచ్చితంగా తీసుకోవటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అంతేకాక దాహంతో ఇబ్బంది పడేవారికి కూడా ఈ తామర పువ్వు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ టీ లో ఉండే పోషకాలు అనేవి దాహాన్ని తీర్చటంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ తామర పువ్వుల టీ శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పి మరియు తిమ్మిరి లాంటి సమస్యలతో ఇబ్బంది పడే మహిళలకు కూడా ఈ తామర పువ్వుల టీ హెల్ప్ చేస్తుంది. మీరు పిరియడ్స్ టైం లో రోజుకు రెండు కప్పుల తామర పువ్వుల టీ తాగితే నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

Lotus Tea ప్రతిరోజు తామర పూల టీ తాగటం వలన కలిగే ముఖ్య లాభాలు ఏమిటో తెలుసా

Lotus Tea : ప్రతిరోజు తామర పూల టీ తాగటం వలన కలిగే ముఖ్య లాభాలు ఏమిటో తెలుసా…!

తామర పువ్వులతో టీ ని తయారు చేసుకునేందుకు ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నీటిని తీసుకొని వాటిని మరిగించాలి. అలాగే మరుగుతున్న నీటిలో తామర పువ్వులు కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇలా చేసేటప్పుడు నీరు మరియు తామర పువ్వుల నిష్పత్తి 4:1 గా ఉండాలి. ఆ తర్వాత ఈ టీ ని చల్లపరచడానికి రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని దానిలో కొద్దిగా గులాబీ సారాన్ని కూడా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన తామర పూవ్వుల టీ రెడీ అయినట్లే. అలాగే కావాలనుకుంటే ఈ టీ లో తేనెను కలుపుకొని తాగితే మరింత రుచిగా ఉంటుంది

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది