Walking : రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తే… ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!
ప్రధానాంశాలు:
Walking : రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తే... ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!
Walking : మీరు నిద్రపోయే ముందు కొద్దిసేపు నడవడం వలన మీ శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీంతో మంచి నిద్ర పడుతుంది. మీరు సాయంత్రం వేళల్లో నడవటం వలన ఒత్తిడి మరియు ఆందోళన కూడా తగ్గుతుంది. అలాగే ఇది మానసిక స్థితిని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. మీరు ప్రతిరోజు పడుకునే ముందు కొద్దిసేపు నడవడం వలన కేలరీలు అనేవి కరిగిపోతాయి. ఇది బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. అయితే సాయంత్రం నడవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం…
గుండె ఆరోగ్యం : సాయంత్రం వేళలో వాకింగ్ చేయడం వలన గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే కండరాలను కూడా బలంగా తయారు చేస్తుంది. అయితే సాయంత్రం నడవడం వలన కాళ్ల కండరాలు బలంగా ఉండటంతో పాటు కీళ్లకు కూడా బలం వస్తుంది…
Walking సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు
– రాత్రి భోజనం తర్వాత కనీసం ఒక అరగంట సేపు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
-ఎక్కువ వేగంగా నడవకుండా తేలికపాటి వేగంతో మాత్రమే నడవండి.
-మీరు వాకింగ్ చేసేటప్పుడు మీకు సౌకర్యవంతమైన బట్టలు మరియు షు మాత్రమే ధరించండి.
– మీకు గనక ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, వాకింగ్ కి వెళ్లే ముందు వైద్యులను సంప్రదించండి…
అయితే ఈవినింగ్ వాక్ అనేది ఏ వయసుగల వారైనా సులభంగా చేయగలిగే వ్యాయామం. వీటికి ప్రత్యేకమైన తయారీ లేక పరికరాలు అనేవి అస్సలు అవసరం ఉండదు. మీరు ఈరోజు నుండే పడుకునే ముందు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు…