Health Benefits : బెండకాయలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Benefits : బెండకాయలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే…!!

Health Benefits : బెండకాయలు మనం రోజు తీసుకునే ఎన్నో కూరగాయలలో ఒకటి. మనం రోజు తీసుకునే కూరగాయలు మనకి తెలియని ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. ఈ కూరగాయలు మనకి కావాల్సిన ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్లు, విటమిన్స్, మినరల్స్ మనకు అందిస్తూ ఉంటాయి. అయితే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల్ని కలిగించే కూరగాయ బెండకాయ. ఈ బెండకాయను వినియోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మరియు ప్రధానంగా బెండకాయలను చాలామంది […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 January 2023,7:00 am

Health Benefits : బెండకాయలు మనం రోజు తీసుకునే ఎన్నో కూరగాయలలో ఒకటి. మనం రోజు తీసుకునే కూరగాయలు మనకి తెలియని ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. ఈ కూరగాయలు మనకి కావాల్సిన ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్లు, విటమిన్స్, మినరల్స్ మనకు అందిస్తూ ఉంటాయి. అయితే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల్ని కలిగించే కూరగాయ బెండకాయ. ఈ బెండకాయను వినియోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మరియు ప్రధానంగా బెండకాయలను చాలామంది వేపుడుగా కూడా చేసి తింటూ ఉంటారు. బెండకాయను లేడీస్ ఫింగర్ లేదా ఓక్ర అని కూడా అంటారు. ఇంకా చాలామంది బెండకాయ తినడానికి ఇష్టపడితే ఇంకొందరు బెండకాయని తినరు. కానీ బెండకాయ వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో మీకు తెలిస్తే వాటిని ఇకనుంచి తినడం మొదలు పెడతారు..

Health Benefits of Okra Of Ladies Finger in telugu

Health Benefits of Okra Of Ladies Finger in telugu

Okra Benefits : ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

ఈ బెండకాయలు కణాల ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. దానివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బెండకాయలు ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది. దీనిలో అధిక మొత్తంలో విటమిన్ కె, పొలైట్ ఐరన్ ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని పెంచడానికి అదేవిధంగా రక్తహీన సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వ్యక్తులు బెండకాయ ఒక మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు. అధిక పైబర్ కంటెంట్ ఉన్నందున బెండకాయ కూరతో కొద్దిగా అన్నం తిన్న కడుపు నిండిన భావన ఉంటుంది. దాంతో తక్కువ ఆకలి అవుతుంది. బరువు తొందరగా తగ్గుతారు. బెండకాయ ఎక్కువ మొత్తంలో కరగని డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది మొత్తం ముఖ్యంగా ప్రేగులను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రేగునే ఆరోగ్యంగా ఉంచటంతో పాటు పెద్దపెద్ద వ్యాధులను తగ్గించడానికి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.

Health Benefits of Okra Of Ladies Finger in telugu

Health Benefits of Okra Of Ladies Finger in telugu

బెండకాయలో పొలిట్, యాసిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కి, కాల్షియం, రాగి, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ లాంటివి అధికంగా ఉంటాయి. బెండకాయలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉపయోగపడే పదార్థం కూడా ఉంటుంది. అలాగే గుండె జబ్బులకు కొలెస్ట్రాలకు ముఖ్య కారణం. ఈ బెండకాయని తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గిపోతుంది. అలాగే షుగర్ ఉన్నవారికి కూడా ఈ బెండకాయ గొప్ప ఔషధం. దీనిలో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేందుకు తోడ్పడుతుంది. ఇతర కూరగాయ సేలతో పోల్చుకుంటే బెండకాయలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది