Raavi Akula : ఈ ఒక్క ఆకుతో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raavi Akula : ఈ ఒక్క ఆకుతో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా…!

Raavi Akula : రావి లేని ఊరు.. వేప లేని వీధి ఉండకూడదని మన పెద్దలు చెప్పే మాట. అంతగా ఈ చెట్టుకు మన పూర్వీకులు ప్రాధాన్యం ఇచ్చారు. భారతీయ సంప్రదాయంలో రావి చెట్టుకు విశేష ప్రాధాన్యం ఉంది. హిందువులు, బౌద్ధులు, జైనులు ఈ వృక్షాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. దీనిని సంస్కృతంలో అశ్వద్ధ వృక్షము అని అంటారు. దీని శాస్త్రీయ నామం రిలీజియోసా.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వృక్షముల్లో అశ్వత్థ వృక్షమున అని చెప్పాడు. బుద్ధుడికి రావి […]

 Authored By jyothi | The Telugu News | Updated on :25 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Raavi Akula : ఈ ఒక్క ఆకుతో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా...!

Raavi Akula : రావి లేని ఊరు.. వేప లేని వీధి ఉండకూడదని మన పెద్దలు చెప్పే మాట. అంతగా ఈ చెట్టుకు మన పూర్వీకులు ప్రాధాన్యం ఇచ్చారు. భారతీయ సంప్రదాయంలో రావి చెట్టుకు విశేష ప్రాధాన్యం ఉంది. హిందువులు, బౌద్ధులు, జైనులు ఈ వృక్షాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. దీనిని సంస్కృతంలో అశ్వద్ధ వృక్షము అని అంటారు. దీని శాస్త్రీయ నామం రిలీజియోసా.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వృక్షముల్లో అశ్వత్థ వృక్షమున అని చెప్పాడు. బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అందుకే ఈ వృక్షాన్ని బోధి వృక్షం అని పిలుస్తారు. ఈ చెట్టు పవిత్రతో పాటు ఎన్నో రకాల ఆయుర్వేద సుగుణాలను ముచ్చుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. రావి చెట్టులోని ప్రతిభాగం ఎన్నో ఆయుర్వేద గుణాల సమాహారం. రావి చెట్టు నుండి వచ్చే గాలి ఎంతో శ్రేష్టమైంది.

దీని ఆకులనుండి ప్రాణవాయువు వస్తుంది. ఈ గాలిని పిలిచితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అందుకే వీధుల్లో దేవాలయాల ప్రాంగణాల్లో రావి చెట్టును పెంచుతారు. చైతన్యమై చురుగ్గా పనిచేస్తుంది. రావి చెట్టు పళ్ళు తింటే జీర్ణశక్తి పెరిగి మలబద్దక సమస్య దూరమవుతుంది. దీని పండ్ల ను తింటే గుండె సంబంధిత వ్యాధులు నయమవుతాయి. రావి పుల్లలతో పళ్ళు తోముకుంటే దంతాలు గట్టిపడి దంత సమస్యలు తగ్గుతాయి. నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని దానికి సరి సమానంగా పటిక బెల్లం కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే ఆ.. సామర్థ్యం పెరగడంతో పాటు వీర్య వృత్తి అవుతుంది. సంతానం కలిగిన స్త్రీలు ఈ మిశ్రమాన్ని బహిష్టైన నాలుగవ రోజు నుండి 14వ రోజు పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు రావి ఆకులతో ఇంట్లో తోరణం కడితే ఆర్థిక సమస్యలు తొలగి ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుందని పలువురి నమ్మకం. వినాయక చవితి రోజున గణపతికి చూసే పత్ర పూజ క్రమంలో అశ్వద్ధ పత్రం 19వది రావి ఆకులు చాలా బలవంతమైన ఆహారం వీటిలో 14 శాతం వరకు ప్రోటీన్లు ఉన్నాయి. గొర్రెలు మేకలు, పశువులకు రావి ఆకులు మేతగా వేస్తే పాలశాతం పెరుగుతుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది