Health Benefits : వీటిని నానబెట్టి రోజూ ఉదయాన్నే తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?
Health Benefits : మనం రోజూ తినే ఆహారంలో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని తాగేవి ఉంటాయి.. ఇంకొన్ని ఉడకబెట్టుకొని తినేవి ఉంటాయి.. ఇంకొన్ని నానబెట్టి తినేవి ఉంటాయి. అయితే.. ఉడకబెట్టి తినే వాటి కన్నా కూడా.. నానబెట్టి తినే పదార్థాల వల్ల మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి.. అలా నానబెట్టి తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Benefits : మెంతులు
మెంతులు ఆరోగ్యానికి చేసే మేలు ఇంకేవీ చేయవు. సాధారణంగా మెంతులను కూరల్లో వాడుతుంటాం. కొందరు మెంతులను పొడి చేసుకొని.. దాన్ని కూరల్లో వేసుకొని తింటుంటారు. అయితే.. మెంతులను ఇలా కాకుండా.. రాత్రి నానబెట్టి.. రోజూ ఉదయాన్నే వాటిని తిని.. మెంతులను నానబెట్టిన నీటిని కూడా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉంటాయి.
రోజూ రాత్రి రెండు చెంచాల మెంతులను నానబెట్టి ఉదయమే వాటిని తిని.. ఆ నీటిని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో ఉంటే పీచు వల్ల పేగులను శుభ్ర పరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే.. నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి కూడా తగ్గుతుంది.
Health Benefits : అవిసె గింజలు
అవిసె గింజలను కూడా రాత్రి కొన్ని నానబెట్టి.. ఉదయాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది. వీటిలో పీచు, యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ బీ, ఐరన్, మాంసకృత్తులు, ఒమోగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
రోజూ ఓ చెంచా నానబెట్టిన అవిసె గింజలను తింటే.. బరువు ఎక్కువ ఉన్నవాళ్లు బరువు తగ్గడంతో పాటు.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే.. శరీరానికి శక్తి వస్తుంది.
anjeer : అంజీరా
అంజీరా పండు అంటేనే పోషకాలకు కేరాఫ్ అడ్రస్. ఈ పండులో ఉన్న పోషకాలు ఏ పండులో ఉండవు. అంజీరాలో విటమిన్ ఏ, బీ, కాల్షియం, ఐరన్, పీచు, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
మార్కెట్ లో డ్రై అంజీరా దొరుకుతుంది. దాన్ని రాత్రి పూట నానబెట్టుకొని పొద్దున్నే తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన ప్రీ రాడికల్స్ తో పోరాడి.. అనారోగ్యాన్ని దరిచేరకుండా చేస్తుంది. అలాగే మెదడు పని తీరు పెరుగుతుంది.
Almonds : బాదాం
రోజూ రాత్రి పూట ఓ నాలుగైదు బాదం గింజలను నానబెట్టి.. ఉదయాన్నే పొట్టు తీసుకొని తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెదడు చురుకుగా పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా రోజూ ఓ నాలుగైదు నానబెట్టిన బాదాంపప్పులను తినాల్సిందే.
బాదాంపప్పు వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. హైబీపీని తగ్గిస్తుంది. అలాగే.. ఎక్కువ బరువు ఉన్నవాళ్లు బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
kismis : కిస్ మిస్
రోజూ రాత్రి గుప్పెడు కిస్ మిస్ ను నానబెట్టి.. ఉదయాన్ని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కిస్ మిస్ లో ఐరన్, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కిస్ మిస్ ను ప్రతి రోజూ నానబెట్టి తింటే.. చర్మం కూడా మెరుస్తుంది. బాడీకి కావాల్సిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.