Eat Spinach : ఈ సమస్యలతో బాధపడేవారు పాలకూరను తింటే ఇక అంతే…!
ప్రధానాంశాలు:
Eat Spinach : ఈ సమస్యలతో బాధపడేవారు పాలకూరను తింటే ఇక అంతే...!
Eat Spinach : పాలకూరలో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకోసమే ఆరోగ్య నిపుణులు పాలకూరను తరచూ తినాలని చెబుతుంటారు. ఇక ఇందులో ఉండేటువంటి క్యాల్షియం ఐరన్ పీచు విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. ఈ క్రమంలోనే కొంతమంది పాలకూరను తినడం హానికరమని చెబుతున్నారు. నిజానికి పాలకూరలో శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కె, మెగ్నీషియం ఐరన్ క్యాల్షియం వంటి పోషకాలు అధిక పరిమాణంలో ఉన్నాయి. అదేవిధంగా ఇందులో తక్కువ క్యాలరీలు ఉన్నందున పాలకూరను క్రమం తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలకూరను ఇతర ఆహారాలతో కలిపి తీసుకున్న కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
అంతేకాకుండా ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే పాలకూర కొందరికి హాని కలిగిస్తుందట. అది ఎలా అంటే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పాలకూరను తింటే ప్రమాదానికి గురవుతారని నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరలో ప్రయోజనాలతో పాటుగా కొన్ని దుష్ప్రభావాలను కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు పాలకూరను తినకపోవడమే మంచిది. ఎందుకంటే అది తిన్న వారి పరిస్థితి మరి తీవ్రంగా మారిపోతుంది. మరి పాలకూరను ఎవరు తినకూడదు..? డైజీషియన్లు దీని గురించి ఏం చెబుతున్నారు…? ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Eat Spinach పాలకూర ఎవరు తినకూడదంటే..
కిడ్నీ స్టోన్ రోగులు : పాలకూరలో ఆక్సలేట్ ఎక్కువగా ఉండటం వలన ఇది కాలుష్యంతో పాటు కిడ్నీలో రాళ్ళను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పాలకూరను అస్సలు తినకూడదు.
అధిక యూరిక్ యాసిడ్ ఉన్న రోగులు : యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు పాలకూరను తీసుకోకూడదు. ఎందుకంటే పాలకూరలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి గౌట్ సమస్యలకు దారితీస్తుంది.
ఐరన్ ఓవర్ లోడ్ ఉన్న వ్యక్తులు : పాలకూర లో ఐరన్ అద్భుతమైన మూలకం. కాబట్టి శరీరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే పాలకూరను తినకూడదు. ఒకవేళ ఐరన్ ఓవర్ లోడ్ ఉంటే కాలేయం గుండె సమస్యలు వస్తాయి.
బ్లడ్ థిన్నర్స్ మందులు తీసుకునే రోగులు : పాలకూరలో విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తం గడ్డలు కట్టడంలో ఇది సహాయపడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి రక్తాన్ని పలచబడించే ఔషధాన్ని తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి పాలకూర తీసుకోవడం వల్ల ఔషధ ప్రభావం తగ్గిపోతుంది. అలాగే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
కడుపులో గ్యాస్ ఎసిడిటీ తో బాధపడుతున్న వ్యక్తులు : పాలకూర కడుపులో అసిడిటీ తో గ్యాస్ మరియు ఉబ్బరం సమస్యలను పెంచే కొన్ని అంశాలు ఉన్నాయి. అదేవిధంగా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు పాలకూరను తినకూడదు…