Health Benefits : ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ చాలు.. భారీగా పెరిగిన పొట్ట, అధిక బరువు కి చెక్…
Health Benefits : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో అలాగే ఊబకాయంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఈ విధంగా ఇబ్బంది పడడానికి కారణాలు టైం టు టైం ఆహారం తీసుకోకపోవడం, సరియైన ఆహారం తీసుకోకపోవడం, ఇష్టానుసారం తినేయడం, ఇవన్నీ వీటికి కారణాలవుతున్నాయి. ఈ విధంగా అధిక బరువును మరియు ఊబకాయాన్ని తగ్గించుకోవాలి అంటే.. ఈ విధంగా చేయడం మంచిది. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని ఒక నాలుగు గ్లాసులు త్రాగాలి. ఇలా త్రాగిన పది నిమిషాల తర్వాత మలవిసర్జనకు వెళ్లాలి. మళ్లీ నాలుగు గ్లాసుల నీటిని త్రాగి మళ్లీ మలవిసర్జన కి వెళ్ళాలి. ఈ విధంగా వెళ్లిన తర్వాత రెండు మూడు గంటల తర్వాత1 గ్లాస్ సొరకాయ జ్యూస్ ని తీసుకోవాలి. ఈ జ్యూస్ లివర్కి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ జ్యూస్ త్రాగలేను అనుకునేవారు. కీర దోసకాయ, టమాటో, క్యారెట్, బీట్రూట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వీటన్నిటిని కలిపి జ్యూస్గా చేసుకుని ఒక గ్లాస్ తీసుకోవచ్చు. ఈ జ్యూస్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. అధికంగా బీటా కెరోటిన్ ఉండేది.. కరివేపాకులో మాత్రమే అయితే వీటిలో ఆ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిని నిత్యము ఒక గ్లాస్ జ్యూస్ లో నిమ్మరసం కలిపి తీసుకున్నట్లయితే అధిక బరువు సులువుగా తగ్గుతారు. తర్వాత మధ్యాహ్నం టైం లో ఒక్క పుల్కా మూడు కూరలతో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే బాన లాంటి పొట్ట కూడా ఈజీగా తగ్గిపోతుంది. ఇంకా ఆకలి ఎక్కువగా ఉండేవాళ్లు పాలుష్ వేయ్యాని రైస్ ని ఒక్క పూట తీసుకోవచ్చు.
సాయంత్రం వేళలో ఫ్రూట్స్ ను సలాడ్ల మార్చుకుని ఆరు గంటల లోపే దానిని తినేసేయాలి. ఈ ఫ్రూట్స్ లలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి లివరికి చాలా మంచిది. తర్వాత 7 గంటల సమయంలో కమలా జ్యూస్ 300 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఉసిరి కాయలను నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. రాత్రి పడుకునే సమయంలో ఈ ఉసిరికాయని ఉమ్మి సేసి నోటిని కడిగేసుకొని పడుకోవాలి. ఇలా చేయడం వలన మద్యం మీదికి మనస్సు గుంజకుండా ఉంటుంది. ఈ విధంగా 21 రోజులపాటు చేయాలి. ఈ విధంగా చేయడం వలన అధిక బరువు, భారీగా పెరిగిన పొట్ట, అలాగే లివర్ కి సంబంధించిన వ్యాధులు సులభంగా తగ్గిపోతాయి.