Health Benefits : వర్షాకాలంలో ఈ కూరగాయలను తీసుకుంటున్నారా… అయితే మీరు కొన్ని ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే,..
Health Benefits : మనం రోజువారి తీసుకునే ఆహారంలో ప్రతిరోజు అన్నం వండుకుంటుంటాం కానీ దానిలోకి మాత్రం ఏదో ఒక వెరైటీ కూరలను వండుకుంటూ ఉంటాం. ఇలా రోజు ఒక వెరైటీ కూరగాయలను వండుకుంటుంటాం. ఇలా చాలా రకాల కూరగాయలను వండుకొని తింటూ ఉంటాం. అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా తీసుకుంటూ ఉంటాం. అయితే నాన్ వెజ్ కన్నా కూరగాయలు తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి. కూరగాయలు తినడమే మన శరీరానికి శ్రేయస్కరం. అయితే సీజన్స్ పట్టి మనం తీసుకునే ఫుడ్ లో మార్పులు చేసుకోవాలి, అంటున్నారు వైద్య రంగం.
అలా చేసుకోవడం వలన మనం ఆరోగ్యవంతులుగా ఉంటూ ఉంటాం. మనం ఆహారం ఎక్కువగా తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాగే అసలు తీసుకోకపోయినా కూడా ఆనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే మనం తీసుకునే ఆహారం తక్కువ కాకుండా ఎక్కువగా కాకుండా సరియైన పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అయితే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు తెలుసుకుందాం…
క్యాప్సికం ఈ వర్షాకాలంలో క్యాప్సికం తీసుకోవడం వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. అలాగే మోషన్స్ వాంతులు కూడా అవుతాయి ఈ క్యాప్సికంలో గ్లూకోస్సిన్ లైట్స్ అనే కెమికల్ ఉంటుంది అందువల్లనే ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే క్యాలీఫ్లవర్ కూడా ఈ వర్షాకాలంలో తక్కువగా తినడం మంచిది ఇది అలర్జీలు కలిగించే గుణాలు దీనిలో ఉంటాయి. అలాగే వంకాయ దీనిలో ఆల్కా లైట్స్ ఉంటాయి మన చర్మం పైన దురదలు వాపులు ఇలాంటి కొన్ని ఎలర్జీలు వస్తుంటాయి అందువలన ఈ వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉందాం.