Health Benefits : ఫ్రూట్స్ డైట్ తో బాడీ డిటాక్సిఫికేషన్… శరీరంలో మలినాలన్నీ బయటకు
Health Benefits : శరీరంలోని మలినాలే సగం రోగాలకు కారణం. మారుతున్నజీవనశైలి, ఆహరపు అలవాట్లు కారణంగా ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఉబకాయం, అధిక రక్తపోటు, అజీర్తి, డయాబెటిస్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అతిగా తినడం, కొవ్వు పదార్థాలు తినడం, ఫ్రైడ్ ఫుడ్, ఆల్కహాల్ కారణంగా శరీరంలో మలినాలు పేరుకుపోతున్నాయి. శరీరంలో పేరకుపోయిన మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేసుకోవాలి. కాలెయం రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు, ఇది ప్రోటీన్ సంశ్లేషణను అందిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే ఇతర జీవరసాయన పదార్థాలను విడుదల చేస్తుంది. కాబట్టి శరీరంలో అవయవాలను కాపాడుకోవాలంటే డిటాక్సిఫికేషన్ పద్దతి అమలు చేయాలి.
అంటే కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం సహా మలినాలను శుభ్రం చేసేందుకు డిటాక్స్ పానీయాలను తాగాలి… నెలలో మూడు రోజులు డైట్ ఫాలో అవుతే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అవేంటో ఇప్పుడు చూద్దాం..ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డిటాక్స్ డ్రింక్స్, వాటర్ తాగితే శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. దీని ద్వారా శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాలేయం మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఆహారం జీర్ణం, రక్త శుద్ధికి తోడ్పడుతుంది. శరీరం నుంచి మలినాలను బయటకు పంపిస్తుంది. అందుకే శరీరానికి డిటాక్సిఫికేషన్ అవసరం.పుదీనా, దోసకాయతో చేసిన డిటాక్స్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేస్తుంది.
Health Benefits : మూడు రోజుల డైట్ ప్లాన్..
దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. సమ్మర్ లో తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి బయటపడొచ్చు. పుదీనా ఆకులు వివిధ రకాల యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కూడా శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది.అలాగే నెలలో మూడు రోజులు ఆహారనియమాలు పాటించి శరీరంలోని మలినాలు బయటకి పంపించవచ్చు. ఈ మూడు రోజులు పరిగడపున ఒక లీటర్ కు పైగా నీళ్లు తాగాలి. తక్కువ కేలరీలున్న ఫ్రూట్స్ కర్బుజా, బొప్పాయ, ఉదయం, మధ్యహ్నం, సాయంత్రం తీసుకోవాలి. అలాగే ఎక్కువ కేలరీలున్న ఫ్రూట్స్ అరటిపండు, సపోటా, పనస వంటివి మూడు పూటలా తీసుకోవాలి. ఈ మూడు రోజులు కేవలం ఫ్రూట్స్ డైట్ మాత్రమే ఫాలో కావాలి. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో మలినాలు బయటకు పంపబడి రక్తం శుద్ది చేయబడుతుంది. దీంతో బాడీ రీప్రెష్ అవుతుంది.