Health Benefits : ప్రేగులను క్లీన్ చేసి.. మలాన్ని బయటకు పంపే అద్భుతమైన ఆహార పదార్థం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ప్రేగులను క్లీన్ చేసి.. మలాన్ని బయటకు పంపే అద్భుతమైన ఆహార పదార్థం!

 Authored By pavan | The Telugu News | Updated on :25 April 2022,7:00 am

Health Benefits : మల్బరీలు మంచి రుచితో పాటు పోషకాలను విరివిగా అందిస్తాయి. ఇవి పూర్తిగా విటామిన్లతో నిండి ఉంటాయి. అలాగే పచ్చి మల్బరీలు 60 కేలరీలను మాత్రమే కల్గి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుతిండి. మీ కణజాలాలకు ఆక్సిజన్ ను అందిస్తుంది. అయితే అందరికీ తాజా మల్బరీస్ అందుబాటులో ఉండవు కాబట్టి డ్రై మల్బరీ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అయితే మల్బరీ పండ్ల వల్ల కల్గే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.మల్బరీలు మన శరీరానికి అవసరమైన మోతాదులో డైటరీ ఫైబర్ ను అందజేస్తుంది. అలాగే మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిమ్మిరి సమస్యల నుండి ఉపశమనం కల్గిస్తుంది.

మల్బరీ బరువు తగ్గించే సామర్థ్యాన్ని కూడా కల్గి ఉంటుంది. అలాగే శరీరంలోని షుగర్ లెవెల్స్ ను చేక్ చేసుకోవచ్చు. డ్రై మల్బరీల్ మీ గో-టు సొల్యూషన్ ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిని గుర్తింవచ్చు. వైట్ మల్బరీస్ లో ఉండే కొన్ని రసాయమాలను టైప్-2 మధుమేహం చికిత్సకు ఉపయోగిస్తారు. అలాగే క్యాన్సర్ కణాలను దూరం చేసే ఆంథోసైనన్ లు మల్బరీస్ లో అధికంగా ఉంటాయి. అవి రెస్వెరాట్రాల్ ను కూడా కల్గి ఉంటాయి. మల్బరీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరించడం ద్వారా వాటి పని తీరును మెరుగు పరుస్తాయి. ఇవి గుండె నుంచి శరీరంలోని ఇతర భాదాలకు రక్తం ప్రవాహాన్ని, రక్తపోటును నిర్ధారిస్తుంది.అలాగే రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

Health Benefits reduce constipation burns fat

Health Benefits reduce constipation burns fat

ఎముక కణజాలాన్ని బలంగా చేస్తుంది. ఇందులో ఉండే విటామిన్ కె, ఇనుము వల్ల ఎముక క్షీణత సంకేతాలను తిప్పికొట్టడానికి, బోలు ఎముకల వ్యాధి మరియు ఆర్థరైటిస్ వంటి ఎముక రుగ్మతలను నిరోధించడంలో సాయపడతాయి. అంతే కాకుండా కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు తరచుగా ఫ్లూ సమస్యతో బాధపడుతుంటే… మల్బరీస్ ప్లూని కల్గించే బ్యాక్టీరియనా చంపేస్తాయి. పలు రకాల ఫ్లేవనాయిడ్లను కల్గి ఉండి ఫ్లూని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే బలుబును కూడా నివారిస్తుంది. మల్బరీస్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే ఆంథోసైనిన్ లు మంటను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది