Health Benefits : వీటిని తిన్నారంటే… రోజంతా యాక్టివ్ గా ఉంటారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : వీటిని తిన్నారంటే… రోజంతా యాక్టివ్ గా ఉంటారు…

Health Benefits : బొగ్గు గనుల్లో పనిచేసే వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ మైనింగ్ వర్క్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఓపెన్ కాస్ట్ మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్. ఈ అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. గుహలాగ ఉండే గాలి ఆడని ప్రదేశంలో ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్లకి ఆక్సిజన్ అనేది సరిగ్గా ఉండదు. బ్రెయిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఎందుకంటే కార్బన్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2022,6:30 am

Health Benefits : బొగ్గు గనుల్లో పనిచేసే వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ మైనింగ్ వర్క్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఓపెన్ కాస్ట్ మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్. ఈ అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. గుహలాగ ఉండే గాలి ఆడని ప్రదేశంలో ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్లకి ఆక్సిజన్ అనేది సరిగ్గా ఉండదు. బ్రెయిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా పీల్చుకోవడం వలన డస్ట్ కూడా ఊపిరితిత్తులలోకి ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఇలాంటి వారికి లంగ్స్ ఎఫెక్ట్ అవడం, సిఓపిడి సమస్యలు, నిమోనియా రావడం వంటి సమస్యలు, దగ్గు రావడం ఎక్కువగా వస్తూ ఉంటాయి.

అండర్ గ్రౌండ్ లో మైనింగ్ పనిచేసే వాళ్లు ఎక్కువగా బరువు పనులు చేస్తూ ఉంటారు. అందువలన వారికి నడుంనొప్పి, కాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఎక్కువ గంటలు నిలబడి పని చేయడం వలన కూడా ఇలా అవుతుంది. మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఇవి తింటే ఎక్కువ గంటలు యాక్టివ్ గా ఉండి పని చేయగలుగుతారు. అందుకనే వీళ్ళకి రోజు ఒక కొబ్బరి చెక్క, నానబెట్టిన వేరుశనగ గుళ్ళు 10, 15 ఖర్చురాలు తినాలి. వీటితోపాటు రెండు జామకాయలు, ఒకటి రెండు అరటి పండ్లు తినాలి. ఇలా చేస్తే దీర్ఘ రోగాలు రాకుండా ఇది సపోర్ట్ చేస్తుంది. మైన్స్ లో వర్క్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ త్రాగాలి. ఒక్కసారే మరిన్ని తాగకుండా కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా తాగితే బాడీ డీహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటుంది.

Health Benefits These food increase strength in our body

Health Benefits These food increase strength in our body

మైన్స్ లో పని చేసేటప్పుడు దుమ్ము ధూళి ఎక్కువగా ఉండడం వలన అదంతా లోపలికి వెళ్లకుండా ముక్కు లోని వెంట్రుకలు అడ్డుకుంటాయి. ఈ ఫిల్టర్స్ గా పనిచేస్తాయి. ముక్కులో ప్రతిరోజు వాటర్ పోసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే డస్ట్ అంత బయటకు వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లలో కొంచెం పసుపు వేసి జలనేతి చేసేస్తే ముక్కు రంధ్రాలో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ప్రాణాయామం చేస్తే లంగ్స్ అంతా శుభ్రం అవుతాయి. ఇలా చేయడం వలన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మైన్స్ లో వర్క్ చేసేవాళ్లు గోళ్ళను అస్సలు పెంచకూడదు. ఎందుకంటే బొగ్గు అంతా గోళ్లల్లోకి వెళ్లి అలానే ఉండిపోయి ఆహారం ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కావున బొగ్గు పనులు చేసేటప్పుడు చేతికి గ్లౌజెస్ వేసుకోవాలి. మైన్స్ లో వర్క్ చేసేవాళ్లు కనీసం ఏడు గంటలైనా తప్పనిసరిగా నిద్రపోవాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది