Diabetes : ఈ ఒక్క ఆకుతో… డయాబెటిస్, పక్షవాతం రాకుండా ఉంటాయి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : ఈ ఒక్క ఆకుతో… డయాబెటిస్, పక్షవాతం రాకుండా ఉంటాయి…

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2022,5:00 pm

Diabetes : మన రక్తంలో రక్తం గడ్డ కట్టడం వలన గుండెలో ఉండే సన్నటి రక్తనాళాల మధ్యలో అడ్డుపడతాయి. దీనివలన రక్తప్రసరణ ఆగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్రెయిన్ లో ఉండే రక్తనాళాల్లో కూడా బ్లడ్ గడ్డ కట్టడం వలన బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ లాంటి వ్యాధులు వస్తుంటాయి. ఇలా రక్తం గడ్డలు కట్టడం వలన ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. దీని నుండి బయటపడడానికి ముందు జాగ్రత్తగా కొన్ని దేశాల్లో 20, 25 సంవత్సరాల నుంచి టాబ్లెట్స్ వాడడం మంచిది అని వాడుతున్నారు. ఇవి రక్తాన్ని గడ్డలు కట్టకుండా పలుచగా చేస్తాయి.

ఇలాంటి టాబ్లెట్స్ ని మనదేశంలో ఎకోస్పిన్ అని డాక్టర్లు బీపీ ఎక్కువ ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు వీటిని ఎక్కువ కాలం వాడాలని చెబుతున్నారు. రక్తం గడ్డలు కట్టకుండా ఉండడానికి ప్రకృతిలో దొరికే ఒక ముఖ్యమైన ఆకు ఉంది. అదే రాకెట్ ఆకు. దీనిని పుదీనా వాడినట్లు వాడితే సరిపోతుంది. బ్రెయిన్ లోను, గుండెలోను రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది అని నార్వే వారు 2022 సంవత్సరంలో కొన్ని పరిశోధనల ద్వారా నిరూపించారు. దీని నుంచి రక్షించడానికి రాకెట్ లీఫ్ బాగా పనిచేస్తుంది. దీని మీద పరిశోధన చేసి రాకెట్ లీఫ్ ఘాటుగా ఉంటుందని, దీనిలో పాలి గ్లైకోసిటడ్ ప్లెవన్స్ ఉండడం వలన రక్తంలో ప్లేట్లెట్స్ అన్ని దగ్గరకు చేరి రక్తం గడ్డ కట్టకుండా ఆపడానికి బాగా ఉపయోగపడతాయి అని నిరూపించారు.

Health Benefits these rocket leaf reduce diabetes and Paralysis

Health Benefits these rocket leaf reduce diabetes and Paralysis

రాకెట్ ఆకులు నైట్రేట్ ఉండడం వలన ఘాటుగా ఉంటాయి. ఇందులో ఉండే గ్లూకోస్ సైనోలెట్స్ ముఖ్యంగా మజిల్ సేల్స్ లోకి గ్లూకోస్ వెళ్లేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి డయాబెటిస్ రాకుండా ఉండడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది. అలాగే ఓవరీస్ లో నీటి బుడగలు రాకుండా చేయడానికి ఈ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. డయాబెటిస్ రాకుండా ఉండడానికి ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి చలికాలంలో విరివిరిగా దొరుకుతాయి. అంతేకాకుండా వీటిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మార్కెట్లో దీని విత్తనాలు దొరుకుతాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది