Health Benefits : పదిహేను రోజుల్లోనే రక్తహీనతను తగ్గించే ఈ రెండు పదార్థాలేంటో చూడండి!
మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటారు. అయితే ఈ కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడి అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే దేన్ని తింటే ఏం వస్తుంది… ఎంత మోతాదులో పోషకాలు లభిస్తాయి వంటి వాటి గురించి తెలియకుండానే తినేస్తుంటాం. శరీరం పోషకాహార లోపంతో అనేక వ్యాధులకు గురవక ముందే మంచి ఆహారాన్ని అందిద్దాం. దీని కోసం మనం తీసుకోవలసినవి మూడే మూడు పదార్థాలు. ఇవి అనేక విటామిన్ లోపాలను తగ్గించడంలో, మన శరీరాన్ని బలంగా తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త హీనత సమస్యను తగ్గించి, రక్తపు నిల్వలను పెంచే మొదటి డ్రై ఫ్రూట్… ఖర్జూరం. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మీ ఆరోగ్య రక్షణకి తగినంత ఫైబర్ పొందడం చాలా ముఖ్యం. ఖర్జూరలో వ్యాధి నిరోధక యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోజూ తినడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సహజమైన శక్తిని పెంచుతుంది. అలాగే అద్బుతమైన సహజ స్వీట్ నెస్ ని కల్గి ఉంటుంది. ఇతర సంబావ్య ఆరోగ్య ప్రయజనాలను చేకూరుస్తుంది. మీ డైట్ కు వీటిని జోడించడం కూడా చాలా సులభం. అంతే కాకుండా ఖర్జూరంలో కనీసం ఆరు రకాల విటామిన్లు ఉంటాయి. విటామిన్ సి, బి, థియామిన్, రిబోఫ్లేవిన్, నికోటినిక్ ఆమ్లం, విటామిన్ ఎ తో పాటు ఫైబర్ ఉన్నట్లు తేలింది.
రెండోది అంజీర్ లేదా అత్తిపండు. ఈ పండ్లలో విటామిన్ ఎ, సి, కె, పొటాషియం, మెగ్నీషియం, ింక్, రాగి, మాంగనీస్, ఇనుము సహా అనేక రకాల ఖనిజాలు, విటామిన్లు ఉంటాయి. అందుకే దీన్ని బరువు తగ్గించుకోవాలనుకునే వారు తరచుగా తింటుంటారు. అయితే ఇవి రక్త పోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చాలా ఇబ్బందిని కల్గించే ఫైల్స్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో బలమైన ఎముకలు ఏర్పడేందుకు, డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అల్జీమర్స్ వ్యాధికి కూడా చికిత్స చేస్తుంది. అందుకే ఖర్జూరాలతో పాటు అంజీర్ లేదా అత్తి పండ్లను రోజూ తినండి.. ఆరోగ్యంగా ఉండండి.