Health Problems : రాత్రి సమయంలో భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించకపోతే.. మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!!
Health Problems : చాలామంది రాత్రి సమయంలో భోజనం చాలా హెవీగా చేస్తూ ఉంటారు. ఎక్కువమంది మధ్యాహ్నం భోజనం కంటే రాత్రి పూట భోజనమే ఇష్టంగా తింటూ ఉంటారు. పగటిపూట ఆఫీసుల్లోనూ లేదా కొన్ని పనుల మీద పడి ఏదో ఒకటి మధ్యాహ్నం కానిస్తూ ఉంటారు. కానీ రాత్రి టైంలో ఇంటిదగ్గర ఉంటారు. కావున ఇష్టమైన ఆహారం కొంచెం పుష్టిగా తింటూ ఉంటారు. అయితే రాత్రి సమయం ఆహారం పరిమితంగా తీసుకోవాలి అని డైజేషన్ నిపుణులు చెప్తున్నారు. అధికంగా లిమిట్ లేకుండా రాత్రి సమయంలో భోజనం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలియజేస్తున్నారు. డైట్లో పక్కా ప్లాన్ చేసుకుంటే బరువు కూడా తగ్గిపోవచ్చు అని చెప్తున్నారు. రాత్రి భోజనం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… శారీరిక వ్యాయామాలు చేసిన కొంతమంది బరువు తగ్గడం ఇబ్బంది పడుతుంటారు.
ఒకవేళ మీరు వ్యాయామం జిమ్ లాంటివి చేస్తున్న బరువు తగ్గడం లేదంటే డైట్ సరిగా లేదని అర్థం చేసుకోవాలి. రాత్రి భోజనం విషయంలో జాగ్రత్తలు వహించకపోతే బరువు పెరిగే అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. అలాగే బరువు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. రాత్రి సమయంలో భోజనం లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ సూచించడం జరిగింది.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి : రాత్రి భోజనంలో ఏం తీసుకోవాలని అనుమానం చాలామందికి కలుగుతూ ఉంటుంది. మొదట ప్రాసెస్ చేసిన ఆహారాలకి దూరంగా ఉండాలి. వీలైతే వాటిని పూర్తిగా మానుకోవాలి. పిండిపదార్ధాలు రాత్రి భోజనంలో తీసుకోవద్దు. పప్పులు కూరగాయలు తృణధాన్యాలు లాంటి వాటిని తీసుకోవచ్చు. అలాగే చేపలు, చికెన్, జున్ను లాంటివి ప్రోటీన్లు తీసుకోవచ్చు.
సలాడ్లు కూడా తీసుకోవచ్చు. వాటి ద్వారా శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇది పొట్టను శుభ్రంగా చేయడంలో ఉపయోగపడుతుంది.. స్వల్పంగా తీసుకోవాలి : అల్పాహారం భోజనం కంటే రాత్రి భోజనం చాలా తక్కువగా తీసుకోవాలంటున్నారు. డైజేషన్లు రాత్రి భోజనం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రోజు చివర్లో మన జీర్ణ క్రియ చాలామంది అలాగే షుగర్ , ఊబకాయం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. త్వరగా రాత్రి భోజనం చేయాలి : రాత్రి ఎనిమిది గంటలు ముందే డిన్నర్ చేయాలని కొంతమంది డైజేషన్ నిపుణులు చెప్తున్నారు. అంటే నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు డిన్నర్ తినేసేయాలి. డిన్నర్ ఎప్పుడు లైట్ గానే తీసుకోవాలి. తొందరగా తీసుకోవాలి. కావున ముందుగానే ఫుడ్ రెడీగా ఉండేలా చూసుకోవాలి ఆఫీస్ లో ఉన్న ఇంట్లో ఉన్న బయటకి వెళ్ళిన తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి.