Health Problems : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా… అయితే డేంజర్ లో ఉన్నట్లే…
Health Problems : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలామందిలో కనిపించే వ్యాధి గుండెకి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధితో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ వ్యాధి రావడానికి కారణాలు ..కొన్ని రకాల ఒత్తిడిలు, సరియైన ఆహారం తీసుకోకపోవడం, సరియైన నిద్ర నిద్రించకపోవడం ఇలాంటివి ఎన్నో కారణాలవల్ల ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటి కారణాల వల్ల హృదయంలో ఉన్న నాలుగు గోడలలో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ కి ఈ కొవ్వు అడ్డుపడటం వలన ఈ గుండెపోటు వచ్చి అవకాశం ఉంటుంది. అయితే ఈ గుండెపోటు వచ్చేటప్పుడు శరీరంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి అవి ఏంటో మనం తెలుసుకుంటే ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. ముందుగా ప్రధానంగా తల, ముఖం, చెవులలో వచ్చేటువంటి కొన్ని మార్పులని చూసి ఈ హార్ట్ ఎటాక్ లక్షణాలను గుర్తించవచ్చు.
Health Problems : ఛాతిలో ఇబ్బంది
చాతిలో నొప్పి లేదా ఇబ్బంది కలిగినప్పుడు హార్ట్ ఎటాక్ కి సహజంగా లక్షణాలలో ఒకటి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ చెప్పిన ప్రకారం.. ఎప్పుడైనా ఎవరికైనా చాతిలో ఇబ్బంది లేదా అధిక నొప్పి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్లను కలవాలి. హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్టు మొదలైనప్పుడు చాతిలో ఇబ్బందిగా ఉండడం, చెమటలు రావడం, ఊపిరి ఆడక పోవడం, వికారం లాంటివన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే చాతి నొప్పిని తెలుసుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. పొత్తికడుపులో ఇబ్బంది: పొత్తికడుపులో ఇబ్బంది లేదా నొప్పి కూడా ఈ గుండె పోటుకి సంకేతం. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
మెడ నొప్పి
బ్లడ్ గడ్డ కట్టడం వలన హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇది గుండె కండరాలకు బ్లడ్ సర్కులేషన్స్ ని పరిమితం చేయబడుతుంది. చాతిలో నొప్పి ప్రారంభమై మెడ వరకు వ్యాపిస్తుంది. ఇలా కండరాలు బిగిసుకుపోయినట్లుగా అవుతుంటాయి. అలాంటి టైంలో కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. స్పృహ తప్పడం: గుండె బ్లడ్ ని పంపించడం ఆగిపోయినప్పుడు బ్లడ్ ఆక్సిజన్ సరఫరా చేయలేకపోవడం వలన గుండె కండరాలకు ఇబ్బందిని కలిగిస్తుంది. గుండె కొట్టుకోవడం తగ్గిపోయి లేదా వేగంగా కూడా కొట్టుకోవడం ఈ విధంగా జరిగినప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి వారు చెప్పిన.. సలహాలు, సూచనలను తప్పక పాటించాలి.