Health Tip : రాత్రివేళ ఈ జ్యూస్ తాగారంటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు…!
Health Tip : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల వలన చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమి అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కొంతమందికి రాత్రి సమయంలో నిద్ర రాదు.. ఈ నిద్రలేమి కారణంగా ఇంకెన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉన్నది.. తినే ఆహారం ద్వారా కూడా నిద్ర లేని సమస్య తగ్గించుకోవచ్చు.. దాని వలన నిద్రలేమితో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పలవాట్లు మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
అన్ని రకాల ఆహారం తీసుకున్న తీసుకోకపోయిన తప్పనిసరిగా ద్రాక్ష రసం తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఎందుకనగా నిద్రపోవాదానికి సహాయపడే మెలట్నిస్ అనే హార్మెన్ ద్రాక్షాలో పుష్కలంగా ఉంటుంది. దీని మూలంగా నిద్రపోవడానికి అరగంట ముందు ద్రాక్షారసం తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య నిపుణులే కాక కొన్ని పరిశోధనలు కూడా దీన్ని ధ్రువీకరించారు.. ద్రాక్ష రసం తాగితే ప్రశాంతమైన నిద్ర తప్పనిసరిగా వస్తుందని కొందరు అధ్యయనంలో పేర్కొనడం జరిగింది. కొంతమందికి నిద్ర వెంటనే వస్తుంది. అలాగే పాలకూరను కూడా నిత్యం తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. ఇదేకాక మజ్జిగ, చెర్రీ పండ్లు ఇలాంటివి తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడానికి నిత్యం రాత్రి సమయంలో ఒక గ్లాసు ద్రాక్ష రసం తాగి పడుకోవడం వలన నిద్ర ముంచుకొస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే సాయంత్రం డిన్నర్ ను పడుకోవడానికి రెండు మూడు గంటలు ముందే తినేస్తే ఈ నిద్రలేమి సమస్య అధిగమించవచ్చు.. అదేవిధంగా నైట్ డిన్నర్ లో రైస్ తీసుకోకుండా ఫ్రూట్స్ తీసుకున్న కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..