Health Tips : జాగ్రత్త.. మీలో ఈ లక్షణాలున్నాయా.. మీకు ఈ అనారోగ్య సమస్య ఉన్నట్లే..
Health Tips : ఉరుకుల పరుగుల జీవనంలో చాలా మంది తమ ఆరోగ్యంపైన కాన్సంట్రేట్ చేయలేకపోవడం మనం గమనించొచ్చు. అయితే, కరోనా వలన జనంలో కొంత అవేర్ నెస్ అయితే వచ్చింది. ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలనే భయం అయితే వచ్చింది. దాంతో జనం గతం కంటే కొత్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. అలా ఆరోగ్యంపైన శ్రద్ధ వహిస్తేనే భూమ్మీద ఉంటామని అందరికీ అర్థం అయింది కూడా. ఇకపోతే మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటు కంపల్సరీగా సమతుల్యతతో ఉండాలి. ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే కాబట్టి..
మీలో ఈ లక్షణాలున్నాయా అనేది గమనించి జాగ్రత్త వహించండి..వైద్యులు చెప్తున్న దాని ప్రకారం.. మనిషికి ఎంతో కీలక మైన గుండె సురక్షితంగా ఉండాలంటే బ్లడ్ ప్రెషర్ అనేది ముఖ్యం. కాగా, ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా.. తక్కువైనా.. ప్రమాదమే. కాబట్టి కంపల్సరీగా ఆ విషయమై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీలో ఈ లక్షణాలు ఉంటే కనుక మీకు లో బీపీ ఉన్నట్లే.. ఆ లక్షణాలు ఏమిటంటే..ఎక్కడైనా కూర్చొని పైకి లేచినపుడు తల దిమ్ముగా అనిపించినట్లయితే.. మీకు బీపీ తగ్గినట్లే అన్న సంగతి అర్థం చేసుకోవాలి.

Health Tips be careful symptoms of low bp
Health Tips : బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే..
ఈ క్రమంలోనే వెంటనే మీరు బీపీ టెస్ట్ చేయించుకోవడం అవసరం. ఇకపోతే మహిళల్లో జనరల్‌గా బీపీ 60/100, మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉన్నట్లయితే లోబీపీ ఉన్నట్లే అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కళ్లు మసకలు బారినట్లుగా కనిపిస్తే కనుక మీలో లో బీపీ లక్షణాలు ఉన్నట్లేనని గుర్తించాలి. ఎటువంటి దృష్టి సమస్య లేకపోయినా మీకు కళ్లు మసకలుగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. మీకు లో బీపీ ఉన్నట్లయితే ఏదేని చిన్న పని చేసినా అలసిపోతుంటారు. ఆ అలసిపోతతో పాటు మీకు ఆయసం కూడా వస్తుంది. ఎక్కువ సేపు ఒక పని చేయలేరు. కాబట్టి మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి.