Health Tips : బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసర్లు తింటే ఏమవుతుందో తెలుసా ..?
Health Tips : తృణధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిల్లో పెసర్లు మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలను చేకూరుస్తాయి. పెసర్లను నానపెట్టి మొలకెత్తిన తర్వాత తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. అయితే చాలామంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసర్లను తింటూ ఉంటారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొలకెత్తిన పెసర్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె, ఎముక, కడుపు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. మొలకెత్తిన పెసర్లలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఒక కప్పు మొలకెత్తిన పెసర్లలో 5.45 ఎంసీజీ విటమిన్ కె ఉంటుంది. ఈ విటమిన్ కే కండరాల బలాన్ని పెంచుతుంది. అలాగే శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకల కణజాల ఉత్పత్తికి విటమిన్ కె చాలా అవసరం. మొలకెత్తిన పెసర్లను తింటే గుండె పదికాలాలు చల్లగా ఉంటుంది. మొలకెత్తిన పెసర్లు గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తప్రసరణ సరిగా అయ్యేలా చేస్తుంది. గుండెకి అడ్డంకి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మొలకెత్తిన పెసర్లతో గుండె పనితీరును మెరుగుపరిచి అనేక వ్యాధులకు దూరం చేయవచ్చు. మొలకెత్తిన పెసర్లను తినడం వలన పొట్టకు అనేక రకాలుగా మంచి జరుగుతుంది. ఇది కడుపులోని మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. అలాగే రక్తాల చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. మొలకెత్తిన పెసర్లు తినడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే మొలకెత్తిన పెసర్లను తినడం వలన కీళ్ల సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.