Health Tips : వర్షాకాలంలో ఇలాంటి సమస్యలకు అల్లం పాలు తీసుకుంటే… ఆ సమస్యలుకు ఇక చెక్…
Health Tips : ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో చిన్నచిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కువగా జలుబులు, దగ్గు, ఇమ్ము, జ్వరాలు విష జ్వరాలు ఇలాంటి వాటితో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ వర్షాల కాలంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షాకాలంలో వాతావరణం మార్పులు జరుగుతుంటాయి. అదేవిధంగా వర్షపు నీరు ఎక్కడబడితే అక్కడ ఆగి దానిలో కొన్ని బాక్టీరియాలు తయారవడం అవి మనుషులకి హాని చేస్తూ ఉంటాయి. వాటి వల్ల ఇలాంటి జలుబు, విష జ్వరాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటితో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. అయితే ఈలాంటి వ్యాధులు వచ్చిన తట్టుకునే శక్తి మన శరీరానికి కల్పించాలి.
అంటే శరీరానికి రోగ నిరోధ శక్తిని పెంచాలి. ఇలా శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచినట్లయితే ఎటువంటి వ్యాధినైనా ఎదుర్కోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే రోగ నిరోధక శక్తి పెరగాలంటే మనం ఇంట్లోనే ఉండే పసుపు, అలాగే అల్లం, పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. పసుపు, అల్లంలో ఎక్కువగా యాంటీ బయాటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అయితే ఒక గ్లాస్ పాలను తీసుకొని దాన్లో పచ్చి అల్లం చిన్న ముక్కను తీసుకొని మెత్తగా దంచి దానిని పాలలో కలిపి చిటికెడు పసుపు వేసి దానిని కలుపుకొని ప్రతిరోజు తాగడం వలన శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా జలుబులు , దగ్గు అదేవిధంగా మలబద్ధకం కూడా తగ్గించే గుణం దీనిలో ఉంది.
అదేవిధంగా జీర్ణవ్యవస్థని చాలా బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్యలకి ఇట్టే తగ్గిపోవాలి. అంటే ఈ అల్లం పాలను ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు త్రాగడం వలన ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. అయితే చిన్నపిల్లలకు తాగించేటప్పుడు అల్లం ఎక్కువ మోతాదులో కలపకుండా, సరియైన మోతాదులో కలిపి ఇవ్వడం అనేది చాలా మంచిది. అయితే కొందరు పాలు తాగడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివారు ఈ అల్లం, కొంచెం పసుపు వేసి ఒక గ్లాసు నీటిని టీ మాదిరిగా చేసి ప్రతిరోజు ఒక గ్లాసును తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా త్రాగడం వలన ఈ వర్షాకాలంలో వచ్చే ఇలాంటి వ్యాధులు నుంచి ఉపశమనం కలుగుతుంది.