Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు ఈ ఆకు ఒక దివ్య ఔషధం… ఎలా తీసుకోవాలంటే…
Diabetes : ఈరోజుల్లో చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు. జీవన విధానంలో మార్పులు, ఆహారంలో పోషకాలు లోపించడం వలన, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చాలామంది డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవడానికి వివిధ రకాల మెడిసిన్స్ ను వాడుతుంటారు. ఎక్కువగా మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రకృతిలో దొరికే కొన్ని ఆకులతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే సాధారణంగా ఎవరికైనా తీపి తినాలి అని ఉంటుంది. బెల్లం ను డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. అయితే ముందు ఈ ఆకును నమలడం ద్వారా చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
పొడపత్రి ఆకు డయాబెటిస్ నుండి మలేరియా వరకు అన్నింటిలో ఉపయోగించే మూలిక. దీనిని పాముకాటుకు కూడా ఉపయోగిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పొడపత్రి ఆకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. ఈ ఆకును ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.పొడపత్రి ఆకు మనదేశంలోని మధ్య, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలోని ఉష్ణ మండల అడవులలో విపరీతంగా పెరిగే ఒక ఔషధ మొక్క. డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే పొడపత్రి ఆకులను పచ్చి ఆకులను నమ్మడం ద్వారా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా అర టీ స్పూన్ పొడపత్రి ఆకుల పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో పొడపత్రి ఆకులను నమలాలి. దీని తర్వాత ఒక గ్లాసు నీరు త్రాగడం ద్వారా డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది.
ఇది కాకుండా పొడపత్రి ఆకును రసం రూపంలో, పౌడర్ రూపంలో కూడా మార్కెట్లో లభిస్తుంది. మీరు ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు దీనిని తీసుకోవచ్చు.అలాగే డయాబెటిస్ బాధితులు బెల్లం ను తినవచ్చు. బెల్లం శరీరంలో ఇన్సులిన్ స్రావం, కణాల పునరుత్పత్తికి కూడా దోహదం చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిని సులభంగా బ్యాలెన్స్ చేస్తుంది. గ్లిజరిన్ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అందువలన బెల్లం డయాబెటిస్ బాధితుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పొడపత్రి ఆకులను పొడిని నీటిలో కలుపుకొని తాగితే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.