Health Tips : ఈ చిట్కాలతో చలికాలం వచ్చే గొంతు నొప్పిని చిటికలో తగ్గించుకోవచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ చిట్కాలతో చలికాలం వచ్చే గొంతు నొప్పిని చిటికలో తగ్గించుకోవచ్చు…!!

 Authored By aruna | The Telugu News | Updated on :13 November 2023,10:30 am

Health Tips : సీజన్ మారినప్పుడల్లా గొంతు నొప్పి రావడం సహజం. దీంతో గొంతులో, నొప్పి ఇన్ఫెక్షన్ మంట, సరిగ్గా మాట్లాడలేకపోవడం లాంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి. అయితే చలికాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా బాధిస్తుంది. ఈ క్రమంలో అలాంటి గొంతు నొప్పిని పోగొట్టేందుకు ఇంట్లో ఉండే పలు సహజసిద్ధ పదార్థాలు చాలు.. అందుకు ఇంగ్లీష్ మెడిసిన్ అక్కర్లేదు. గొంతు నొప్పి తగ్గించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వేడి చికెన్ సూప్ గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే ఓ బౌల్ వేడివేడిగా చికెన్స్ తాగాలి. ఆయా సమస్యలకు చికెన్ షూప్ ఔషధంగా పనిచేస్తుందట.. అంతేకాదు జలుబు ఉన్న తగ్గిపోతుంది.

మసాలా టీ.. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసుకుని వేడివేడిగా తాగాలి. ఈ మసాలా టీతో గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది. జలుబు దగ్గు వంటి సమస్యలు ఉన్న పోతాయి. అల్లం రసం ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో చక్కని అల్లం రసం వస్తుంది. అప్పుడు ఆ రసాన్ని వడగట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్షణాల్లో తగ్గుతుంది. పెరుగు. రోజులో వీలైనన్ని సార్లు పెరుగును తింటూ ఉండాలి. దీన్ని చల్లగా మాత్రం తినకూడదు.. గది ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతే ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పెరుగును తినాలి. దీంతో అందులో ఉండే ఔషధ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.. తేనే నిమ్మరసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనెలను కలుపుకొని త్రాగాలి.

వీటిలో ఉండే సహజసిద్ధమైన యాంటీబయోటిక్ ,యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పి తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. జలుబు కూడా తగ్గుతుంది. ఓట్స్ అరటిపండు బాగా ఉడికించి అందులో అరటిపండు వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తినేయాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది..నల్లమిరియాలు మిరియాలతో చేసిన చారు లేదంటే మిరియాల వేసి మరిగించిన పాలను తాగుతుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా మాయమవుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆహార పదార్థాలపై చల్లుకొని తిన్నా లేదంటే దాని నేరుగా ఒక టీ స్పూన్ తింటున్న గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది