Health Tips : కేవలం నాలుగు ఆకులు చాలు… కిడ్నీలో రాళ్లు ఇట్లే కరిగిపోతాయి…!
Health Tips : మూత్రపిండాలు మానవుని శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. శరీరం నాలుగు మూలలకి రక్తాన్ని పంపించేది గుండె. ఆ రక్తం లో చేరుతున్న విషాన్ని గాలించి వడపోసి శుభ్రం చేసే పని కిడ్నీలది. ఈ కిడ్నీలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. అవి శరీరంలో నీరు లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. రక్తపోటుని నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీలకి కొన్నిసార్లు రాళ్లు ఏర్పడడం వివిధ రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కిడ్నీలో రాళ్లు రావటం ఆక్సలైట్స్ క్రిస్టల్స్ ఎక్కువగా ఉండటం వలన ఏర్పడతాయి.
కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఎక్కువగా తాగడం దీంతోపాటు మంచినీళ్లు తక్కువగా తాగడం వలన కిడ్నీలో రాళ్లు రావడానికి కారణం అవుతున్నాయి. క్యాల్షియం మరియు ఆక్సలైట్స్ క్రిస్టల్స్ ఈ రెండు కలిపి ఏర్పడి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. 70% కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఆక్సలైట్స్ కారణం. అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి రణపాల ఆకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రణపాల ఆకులో 12 రకాల కెమికల్ కాంపౌండ్, ఫైటో న్యూట్రియన్స్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. ఈ రణపాల ఆకు ముఖ్యంగా యూరిన్ ద్వారా ఎక్కువ కాల్షియం బయటికి వెళ్లకుండా నియంత్రిస్తుంది.
ఈ రణపాల ఆకు దెబ్బలు, పుండు మానకుండ ఉన్నప్పుడు దీని పేస్ట్ కి కొద్దిగా పసుపు కలపాలి. దీనిలో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉండటం వలన త్వరగా మానుతాయి. కొంతమందికి చెవిలో చీము కారుతూ ఉంటుంది. అది తగ్గటానికి రణపాల ఆకు రసం తీసి ఫిల్టర్ చేసి ఆ రసాన్ని చెవులో వేసుకోవడం వలన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండటం వలన చెవిలో చీము తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పి కూడా ఈ రణపాల ఆకు తగ్గిస్తుంది. నాలుగైదు రణపాల ఆకుల్ని నీటిలో డికాషన్ లాగా మరిగించి తేనె కొద్దిగా వేసుకొని కలిపి తాగవచ్చు. ఇలా త్రాగడం వలన కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లకి చాలా మంచిది.