Health Tips : ఈ ఫుడ్ ఐటమ్స్‌తో లైంగిక శక్తి బాగా పెరుగుతుంది…!
Health Tips : ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి జీవనశైలి చాలా మారిపోయింది. ఆహారపు అలవాట్లు, వర్కింగ్ కల్చర్ పూర్తిగా చేంజ్ అయింది. దాంతో హ్యూమన్ బాడీకి ఫిజికల్ ఎక్సర్ సైజ్ అయితే జరగడం లేదు. ఈ సంగతి అటుంచితే.. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో ప్రతీది చాలా స్పీడ్‌గా జరగాలని చాలా మంది అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా దంపతులు దాంపత్య జీవనం అస్తవ్యస్తం అవుతున్నది. పని బిజీలో పడిపోయి దంపతులు లైంగిక కోరికలు తీర్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
దంపతుల మధ్య దూరం పెరగడానికి కారణం స్ట్రెస్ అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఒక రకంగా కారణమని అంటున్నారు. ఈ క్రమంలోనే లైంగిక సామర్థ్యం పెంచే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీనస్ గాడెస్ చిహ్నాంగా పిలవబడే స్ట్రాబెర్రీలను నవ దంపతులకు ఇస్తుండటం మనం చూడొచ్చు. ఈ ఫ్రూట్స్‌లో సంతానోత్పత్తిని పెంచే విటమిన్ సి, మెగ్నిషియం, పొటాషియం, ఇతర మినరల్స్ ఉంటాయి. ఇవి సామర్థ్యాన్ని పెంచుతాయి.
Health Tips : ఈ ఆహార పదార్థాలతో రెట్టింపు లైంగిక శక్తి..
అంగస్తంభన లక్షణాలకు దివ్య ఔషధంగా అత్తి పండ్లు పని చేస్తాయి. అనేక అధ్యయనాల్లో ఈ విషయం రుజువైంది. సంతానోత్పత్తిని కలిగించే పోషకాలు ఈ అత్తి పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అంజీర్‌లోనూ మనుషులకు కావల్సిన ముఖ్యమైన పోషకాలున్నాయి. ఇకపోతే గుడ్డు ఆకారంలో ఉండే అవోకాడో కూడా లైంగిక శక్తిని పెంచగలదు. పలు అనారోగ్య సమస్యలకు దానిమ్మ పండుతో చెక్ పెట్టొచ్చు. ఇందులోనూ లైంగిక శక్తిని పెంచే లక్షణాలుంటాయి. కాయధాన్యాలు, బీన్స్‌లో ఉండే విటమిన్స్, మినరల్స్ కూడా సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి.