Beauty Tips : అరటి తొక్కలో ఇది కలిపి రాసారంటే… ఎంత నల్లటి వారైనా తెల్లగా అవ్వాల్సిందే…
Beauty Tips : చాలామంది స్త్రీలకు ముఖంపై నల్లటి మచ్చలు, వలయాలు ఉంటాయి. దీని వలన ఎంత అందంగా ఉన్న వారైనా అంద హీనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా తయారవడం కోసం వివిధ రకాల కెమికల్స్ వాడుతూ ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తుంటారు. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వేలవేల డబ్బులు వృధా అయిపోతాయి. ముఖంలో ఎటువంటి మార్పు ఉండదు. అలాంటివారు నాచురల్ పద్ధతిలో ఇంట్లో ఉన్న పదార్థాలతో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ వలన చర్మంపై ఉండే మచ్చలు తగ్గి చర్మం అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. అరటి తొక్కలతో ముఖానికి ప్యాక్ తయారు చేసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ ముఖంపై ఉండే మొటిమల వల్ల వచ్చే నల్లటి మచ్చలు, ఓపెన్ ఫోర్స్ తగ్గి ముఖం అందంగా తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మూడు బాగా మగ్గిన అరటిపండు తొక్కలను తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ బియ్యం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ కార్ను ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం పడదనుకున్న వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ ని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకునే ముందు ఒకసారి శుభ్రంగా నీటితో ముఖాన్ని కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంటసేపు ఆరనివ్వాలి.
ముఖానికి ఈ ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అప్లై చేశాక అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఏదైనా మాయిచ్చర్ లేదా కొబ్బరి నూనెను వెంటనే రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి తయారు చేసుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వారం రోజులు పాటు ఉపయోగించవచ్చు. ఈ చిట్కాను వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వలన ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, వలయాలు, డార్క్ స్పాట్స్ ,ఓపెన్ ఫోర్స్ తగ్గి చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ఉండే టాన్ రిమూవ్ అయి నలుపు మొత్తం పోతుంది. ఈ ప్యాక్ ను ముఖానికే కాకుండా కాళ్లు, చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు.