Healthy Foods At Night : రాత్రి పడుకునే ముందు తీసుకోవాల్సిన ఆహారాలు.. అన్ని విధాలుగా మంచిది
healthy foods at night రాత్రి పడుకునే సమయంలో తినే ఆహారం ఆరోగ్యంను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నిద్ర పోతున్న సమయంలో జీర్ణ వ్యవస్థ పని చేయాల్సి వచ్చే పదార్థాలు కాకుండా ఈజీగా అరిగి పోయే ఆహారంను తీసుకోవాలి. లేదంటే పడుకోవడానికి కనీసం గంటన్నర రెండు గంటల ముందే అయినా ఆహారంను తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మాత్రమే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఉభకాయం నుండి మొదలుకుని పలు అనారోగ్య సమస్యలు రాత్రి భోజనం కారణంగా మొదలవుతూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా రాత్రి healthy foods at night సమయంలో ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకోవాలి. రాత్రి సమయంలో తీసుకోవాల్సిన ఆహారంలో ముఖ్యమైన 5 ఆహారాలను ఇప్పుడు చూద్దాం.
1. కోడి గుడ్లు అధికంగా తింటే లావు అవుతారని అనుకుంటారు. కాని కోడిగుడ్లను రాత్రి పడుకునే సమయంలో ఎల్లో లేకుండా వైట్ వరకు తింటే ఈజీగా అరగడంతో పాటు నిద్ర బాగా పడుతుంది. నిద్ర ఎక్కువగా పోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి healthy foods at night పొద్దు పోయాక నిద్ర పోయినా కూడా డీప్ స్లీప్ అవ్వడం వల్ల తక్కువ సమయంకే లేచినా పెద్దగా సమస్యలు ఉండవు. అందుకే కోడిగుడ్డు తిని పడుకోవడం మంచిది.
2. వాల్ నట్స్ ను రెగ్యులర్ గా పడుకునే సమయంలో మితంగా తినడం వల్ల మంచి ప్రభావంను చూపిస్తాయి. శరీరం యొక్క జీర్ణ క్రియతో పాటు అనేక రకారలుగా ఆరోగ్యానికి వాల్ నట్స్ ప్రయోజనం చేకూర్చుతాయి.
3. గడ్డి చామంతి పూల తో చేసిన టీ ని రాత్రి healthy foods at night సమయంలో తాగడం వల్ల తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. జీర్ణ వ్యవస్థను బాగా పని చేసేలా చేయడంతో పాటు అన్ని విధాలుగా ఈ టీ ఆరోగ్యదాయకంగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోదక శక్తిని పెంచుతాయి.
4. రాత్రి పడుకునే సమయంలో గ్లాస్ పాలలో తేనె మరియు రెండు లేదా మూడు చుక్కల నిమ్మ రసంను కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. నిద్ర బాగా పట్టడంతో పాటు అన్ని విధాలుగా ఆరోగ్యదాయకంగా ఉంటుంది.
5. రాత్రి సమయంలో మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదాంలు లేదా రెండు అరటి పండ్లను తినడం వల్ల కూడా పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. సుఖ నిద్రకు కూడా ఇవి చాలా సాయం చేస్తాయి. శరీరం రిలాక్స్ అవ్వడంలో వీటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. కనుక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.