Heart Attack : రోజుకు గుండెపోటుకు మధ్య సంబంధం ఏమిటి… నిపుణులు ఏమంటున్నారు…!
ప్రధానాంశాలు:
Heart Attack : రోజుకు గుండెపోటుకు మధ్య సంబంధం ఏమిటి... నిపుణులు ఏమంటున్నారు...!
Heart Attack : ప్రస్తుత కాలంలో గుండెపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో గుండెపోటు సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఒకప్పుడు మాత్రం 50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్యలు వచ్చేవి. కానీ ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో ఈ గుండెపోటు రావటం అనేది ఎంతో ఆందోళన కలిగిస్తున్నది. ఇదిలా ఉండగా, గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా ఎన్నో అపోహాలు ఉన్నాయి. అలాంటి వాటిలలో ఒకటి. సోమవారం నాడు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం…
బ్రిటిష్ కార్డియోవాస్కులర్ కమిటీ కూడా సోమవారం నాడు తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంది అని నమ్ముతున్నారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ గుండెపోటు రావడానికి మరియు రోజుకు ఎలాంటి సంబంధం అనేది లేదు అని అంటున్నారు నిపుణులు. అయితే ఒక్కసారిగా ఒత్తిడి అనేది పెరగటం వలన కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అని అంటున్నారు. అయితే సాధారణంగా ఆదివారం రోజు సెలవు గడిపిన తర్వాత నెక్స్ట్ డే అనగా సోమవారం నాడు డ్యూటీకి వెళ్లాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కావున ఈ ఒత్తిడి వలన సోమవారం నాడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఒత్తిడి కారణంగా రక్త పోటు మరియు చక్కెర స్థాయి అనేవి వేగంగా పెరుగుతాయి. ఇవి కూడా గుండెపోటు ప్రమాదాలను పెంచగలవు అని అంటున్నారు నిపుణులు.
అయితే తీవ్రమైన ఒత్తిడితో బాధపడే వారిలో కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడితో వర్క్ చేసేవారిలో కూడా సోమవారం నాడు గుండెపోటు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సాధారణ రోజులతో పోల్చినట్టయితే వారం మొత్తంలో ఎక్కువగా పనిచేస్తారు. ఈ కారణం వలన కూడా సోమవారం నాడు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సోమవారం నాడు గుండెపోటు రావటానికి నిర్దిష్టమైన కారణాలు మాత్రం తెలియలేదు…