High Thirst : విపరీతంగా దాహం వేస్తే మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే..
High Thirst : ప్రతీ ఒక్కరు కంపల్సరీగా రోజుకు కనీసంగా ఐదు లీటర్ల వాటర్ తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలా వాటర్ తీసుకోవడం హ్యూమన్ బాడీ యాక్టివ్‌గా ఉంటుందని, హెల్దీగా ఉండొచ్చని వివరిస్తున్నారు. అయితే, అధిక దాహం మాత్రం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. పదే పదే దాహం వస్తే శరీరంలో ఈ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.అధికంగా దాహం వేస్తున్నట్లయితే అది కామన్ సమస్య అనుకుని అలానే ఉండొద్దని వైద్యులు చెప్తున్నారు.
అధికంగా దాహం వేస్తున్నట్లయితే శరీరంలో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నట్లు గుర్తించాలని పేర్కొంటున్నారు వైద్యులు. దాహం ఎక్కువగా వేస్తే శరీరంలో అంతర్గత సమస్యలూ ప్రాణాంతక పరిణామాల వరకు తీసుకెళ్తాయని వివరిస్తున్నారు. కాబట్టి అధిక దాహం వేసినపుడు శరీరం పట్ల అశ్రద్ధ వహించొద్దు. బాడీలో బ్లడ్ పర్సంట్ తక్కువగా ఉన్నపుడు దాహార్తి ఉంటుంది. బ్లడ్‌లో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నా మళ్లీ దాహం వేస్తుంది. ఎనీమియా రక్తహీనత ఉన్న వారిలోనూ అధిక దాహార్తి ఉంటుంది.ఇకపోతే పదే పదే నీళ్లు తాగుతున్నారంటే షుగర్ ఇష్యూ కూడా మీ బాడీలో ఉన్నట్లేనన్న సంగతి గ్రహించాలి.
High Thirst : అధికంగా దాహం ఉన్న వారిలో ఈ డిసీజెస్..
ప్రతీ సారి నీళ్లు తాగితే మంచిదేనని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంటుంది. కానీ, అతి ఎప్పుడైనా చేటేనన్న సంగతి గుర్తించాలి. అది వాటర్ విషయంలోనూ వర్తిస్తుంది. ఎక్కువగా దాహం వేయడం షుగర్ ప్రైమరీ లక్షణం కాబట్టి దాహం అతిగా వేసే వారు కంపల్సరీగా జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకోవాలని సూచిస్తున్నారు. బ్లడ్‌లో అవసరానికి మించి క్యాల్షియం ఉంటే కూడా అధిక దాహం సమస్య ఉత్పన్నమవుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తగు జాగ్రత్తలు పాటించడంతో పాటు అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.