Tea : టీ డే హిస్టరీ… టీ తాగటం వలన ప్రయోజనం ఏమిటి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea : టీ డే హిస్టరీ… టీ తాగటం వలన ప్రయోజనం ఏమిటి…!

Tea : ఉదయం లేవగానే ఛాయ్ తాగటం అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అలవాటు.అయితే ఛాయ్ చటుక్కున తాగారా బాయ్, అని మన మెగాస్టార్ స్వయంగా పాడిన పాట మీకు గుర్తుండే ఉంటుంది కదా. దీనిలో అన్నగారు ఛాయ్ తో కలిగే లాభాలను పూస గుచ్చినట్లుగా చెబుతాడు. దీనిని ప్రేమించని వాడు ఈ జగతి పై ఉండడు రా అని మెగా బ్రదర్ ఆనాడే చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక ప్రాముఖ్యత లో గొప్ప చరిత్ర కలిగినటువంటి […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 May 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : టీ డే హిస్టరీ... టీ తాగటం వలన ప్రయోజనం ఏమిటి...!

Tea : ఉదయం లేవగానే ఛాయ్ తాగటం అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అలవాటు.అయితే ఛాయ్ చటుక్కున తాగారా బాయ్, అని మన మెగాస్టార్ స్వయంగా పాడిన పాట మీకు గుర్తుండే ఉంటుంది కదా. దీనిలో అన్నగారు ఛాయ్ తో కలిగే లాభాలను పూస గుచ్చినట్లుగా చెబుతాడు. దీనిని ప్రేమించని వాడు ఈ జగతి పై ఉండడు రా అని మెగా బ్రదర్ ఆనాడే చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక ప్రాముఖ్యత లో గొప్ప చరిత్ర కలిగినటువంటి టీ కి మే 21న టీ అంతర్జాతీయ దినోత్సవం గా గుర్తించారు. గుడిసెలో ఉన్నటువంటి పేదవాడి దగ్గర నుండి బంగ్లా లో ఉండే ధనవంతుల వరకు తాగే పానీ యం టీ. టీ గురించి చెప్పాలి అంటే. మాటలు మరియు పాటలు కూడా సరిపోవేమో టీ పొడిలో ఉన్నటువంటి కొన్ని కారకాలు మెదడును ఉత్తేజపరిచి పనిపై శ్రద్ధ చూపేలా చేస్తాయి. కూలి పని చేసేవారు రిలాక్స్ కోసం టీ తాగితే, పరిశోధకులు మెదడును మరింత ఉత్తేజం చేసేందుకు తీసుకుంటారు. టీ లో ఉన్నన్ని లాభాలు మరీ ఏ దానిలో లేవు..

అంతర్జాతీయ టీ దినోత్సవం కోసం 2005లో మొదటి ఉద్యమం ప్రారంభమైంది. ఆసియా, ఆఫ్రికాలో ఉన్న కార్మిక సంఘాలు,చిన్న తేయాకు పెంపకం దారులు, సామాజిక సంస్థలు కూడా దీనిని సమర్థించాయి. తేయాకు ఉత్పత్తి చేసే వారికి న్యాయమైన ధరలు, కార్మికులకు వేతనాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐక్యరాజ్య సమితి మే 21వ తేదీన అంతర్జాతీయ టీ దినోత్సవం గా ప్రకటించింది. టీ యొక్క సుదీర్ఘ చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించటం మరియు తే యాకు పండించే ప్రాంతాలలో పేదరికంతో పోరాటంతో దాని ప్రాముఖ్యతను నిర్వహిస్తుంది.

Tea టీ డే హిస్టరీ టీ తాగటం వలన ప్రయోజనం ఏమిటి

Tea : టీ డే హిస్టరీ… టీ తాగటం వలన ప్రయోజనం ఏమిటి…!

ఒత్తిడిలో ఉన్నప్పుడు చమె మిలే టీ తాగితే శాంత పడతారు. ఈ టీ ప్రయోజనాలు అనేవి విశ్రాంతికి మించి విస్తరించి ఉంటాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. జీర్ణక్రియ శక్తిని పెంచడంతో పాటుగా రుతుక్రమ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. శక్తివంతమైన మరియు శాంత పరిచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది గ్రీన్ టీ. కుంకుమపువ్వు, సుగంధ ద్రవ్యాల ప్రత్యేక కలయిక, ప్రధానమైన కాశ్మీరీ పానీయం వివిధ సుగంధ ద్రవ్యాలు వెచ్చదనం అందిస్తాయి. ఇది రోజును మొదలుపెట్టడానికి మరియు సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, అల్లం,ఇలాచీ లాంటి ఉపయోగమైన మూలికలతో నిండి ఉంది. ఈ పవర్ హౌస్ పదార్థాలు మీరు ఆరోగ్యంగా ఉండటానికి మీరు సవాల్ ను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. సంవత్సరం అంతటా కూడా మీకు ఎంతో ఉత్తమమైన అనుభూతిని కూడా ఇస్తుంది. బరువు తగ్గాలి అని అనుకునే వారికి కొన్ని ప్రత్యేక టీలు కూడా ఉన్నాయి. ఆరోగ్యమైన జీర్ణక్రియను ప్రోత్సహించటం వలన బరువు తగ్గొచ్చు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది