Home Remedies : మీ కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయని చింతిస్తున్నారా… వీటితో మటుమాయం…?
ప్రధానాంశాలు:
Home Remedies : మీ కళ్ళ కింద... నల్లటి వలయాలు ఉన్నాయని చింతిస్తున్నారా... వీటితో మటుమాయం...?
Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి. కావునా సమయానికి సరైన నిద్ర చాలా అవసరం అంటున్నారు వైద్యులు. చల్లటి వలయాలను కొన్ని సందర్భాలలో వైద్య చికిత్సలతో పరిష్కరించవచ్చు. వీటికి నిరంతరం లేదా తీవ్రమైన కేసులకు చర్మ ఫీల్లర్లు లేదా లేజర్ తెరఫీ వంటి వృత్తిపరమైన చికిత్సలను పరిగణించవచ్చు. ఈ విధమైన చికిత్సలు కాకోకుండా, చాలా సులభమైన పద్ధతిలో ఇంటి నివారణలతో కళ్ళ కింద నల్లటి వలయాలను మటుమాయం చేసుకోవచ్చు అంటున్నారు నీపుణులు.

Home Remedies : మీ కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయని చింతిస్తున్నారా… వీటితో మటుమాయం…?
Home Remedies కోల్డ్ కంప్రెస్
కళ్ళ కింద నల్లటి వలయాలు లేదా వాపును తగ్గించడానికి ఇంకా రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మీ కళ్ళ కింద ఉన్న ప్రాంతానికి 10 నుంచి 15 నిమిషాల పాటు కోల్డ్ కంప్రెస్ అంటే చల్లటి చెంచాలు, చల్లటి టీ బ్యాగులు, లేదా టవల్తో చుట్టబడిన కూరగాయల సంచి, వీటితో మసాజ్ చేస్తే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
కీరదోసకాయ ముక్కలు : చల్లని దోసకాయ అంటే కీరదోసకాయ ముక్కలను గుండ్రంగా కట్ చేసి, మీ కళ్ళపై పది నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి.ఇది నల్లటి వలయాలను తగ్గించడమే కాక,కంటి నుంచి కూడా త్వరిత ఉపశమనాన్ని అందిస్తుంది.
బాదం నూనె : కళ్ల కిందా చర్మాన్ని తేమగాను, కాంతివంతంగా మార్చడానికి, బాదం నూనెను సున్నితంగా మసాజ్ చేయాలి.ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే నల్లటి వలయాలు సమస్య నుంచి బయటపడవచ్చు. కంటి వాపు కూడా తగ్గుతుంది.
అలోవెరా జెల్ : కళ్ళ కింద చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి తక్కువ నిద్ర కారణం కావచ్చు. కాబట్టి, కంటికి ఒత్తిడిని తగ్గించడానికి అలోవెరా జెల్ ను రాయండి.దీనివల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి.
రోజ్ వాటర్ : రోజ్ వాటర్ లో దూదిని నానబెట్టి,ఆ దూదిని కళ్ళ కింద, ఇంకా, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి,ఇంకా నల్లటి వలయాలపై అప్లై చేయండి. కొన్ని రోజులపాటు చేస్తూ వస్తే మీ కళ్ళ కింద నల్లటి వలయాలు మటు మాయమవుతాయి అంటున్నారు నిపుణులు.