Long Hair : రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేసి పడుకోండి.. మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Long Hair : రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేసి పడుకోండి.. మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది…!

Long Hair : జుట్టు రాలిపోతున్న.. చుండ్రు సమస్యలు ఉన్న.. బలహీనంగా ఉన్న సరే మీరు ఎలాంటి హోమ్ రెమిడీలు తయారు చేసుకోవాలన్న టైం ఉండట్లేదు కదా.. మీలో కొంతమంది బిజినెస్ పీపుల్ ఉండొచ్చు. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు. మరి కొందరు కాలేజెస్ కి వెళుతూ ఉండొచ్చు. ఇలా బిజీ పీపుల్ హోం రెమిడీస్ తయారు చేసుకోవడం చాలా కష్టం. మరి అయితే బిజీ పీపులైనా రాత్రి వేళలో కచ్చితంగా విశ్రాంతి తీసుకుంటారు కదా.. ఆ […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Long Hair : రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేసి పడుకోండి..

  •  మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది...!

Long Hair : జుట్టు రాలిపోతున్న.. చుండ్రు సమస్యలు ఉన్న.. బలహీనంగా ఉన్న సరే మీరు ఎలాంటి హోమ్ రెమిడీలు తయారు చేసుకోవాలన్న టైం ఉండట్లేదు కదా.. మీలో కొంతమంది బిజినెస్ పీపుల్ ఉండొచ్చు. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు. మరి కొందరు కాలేజెస్ కి వెళుతూ ఉండొచ్చు. ఇలా బిజీ పీపుల్ హోం రెమిడీస్ తయారు చేసుకోవడం చాలా కష్టం. మరి అయితే బిజీ పీపులైనా రాత్రి వేళలో కచ్చితంగా విశ్రాంతి తీసుకుంటారు కదా.. ఆ టైంలోనే ఒక్క రెండు నిమిషాల్లో ఈ రెమెడీ తయారైపోతుంది. చక్కగా మీరు తయారు చేసుకొని అప్లై చేసి మీరు ఆరాముగా విశ్రాంతి తీసుకోవచ్చు.. ఇలా రెగ్యులర్గా చేస్తే మీ హెయిర్ ఉండే సమస్యలన్నీ పోయి జుట్టూ నిగనీగలాడుతూ ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. అయితే ఈ రెమిడీ కూడా ప్రతి రోజు తయారు చేసుకోవడం కష్టం కదా అనుకుంటున్నారా.. అలా ఏం లేదు.. మీరు ఒక్కసారి తయారు చేసుకుంటే వారం పది రోజులు ఫ్రిజ్లో ఉంచుకొని వాడుకోవచ్చు. అంత సూపర్ రెమిడీ ఇది.

మరి రెమిడి ఎలా తయారు చేసుకోవాలి? వీటికి ఏమేం కావాలి అనే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం.. శరీరంలో ఐరన్ కొరత ఏర్పడినప్పుడు వెంట్రుకలు రాలిపోతాయి. ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఆర్థరైటిస్, గుండె సమస్యలు, అధిక రక్త పీడనం పంటి వ్యాధులకు మందులు వాడేవారు మాత్రమే కాకుండా ఎక్కువగా డిప్రెషన్ గురయ్యేవారు రక్తం పలుచగా ఉండే వారిలో జుట్టు త్వరగా రాలిపోతుంది. అంతే కాకుండా అధిక మోతాదులో విటమిన్ ఏ తీసుకోవడం వల్ల కూడా వెంట్రుకలు తెగిపోతాయి. చూశారు కదా.. మనకి జుట్టు రాలడానికి జుట్టు డ్యామేజ్ చేయడానికి కారణాలు మరి ఇప్పుడు మ్యాజిక్ రెమిడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా పింక్ కలర్ లో ఉండేది తీసుకోండి. మంచి రిజల్ట్ ఇస్తుంది. గ్రేటర్ తో సన్నగా కోరుకొండి. ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రిడియంట్స్ అల్లం. ఈ అల్లం కూడా 2 ఇంచలు ఉండేది తీసుకుని పైపొట్టు చెక్కేసి శుభ్రంగా కడిగి ఉల్లిపాయలను మనం ఎలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నామో అలాగే అల్లాని కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు ఈ రెండింటిని ఒక క్లాతులో వేసి చక్కగా రసాన్ని ఒక బౌల్లోకి పిండేయండి. ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా.. ఇది మీరు ఒక్కసారి తయారు చేసుకుని మంచి గాజు గ్లాసులో గాని ప్లాస్టిక్ కంటైనర్ లో గాని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది వారం పది రోజులు వరకు పాడవ్వకుండా చక్కగా ఉంటుంది. మనం ఎప్పుడు ఈ రెండు అప్లై చేసుకుంటామో అప్పుడు మనం ఈజీగా తీసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ ని ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఇంకో బౌల్ తీసుకోండి. ఇందులో మీ హెయిర్ కి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ వాటర్ ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు ఎంత వాటర్ అయితే తీసుకున్నారో దానికి ఈక్వల్ గా కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఒక రెండు ఈ విటమిన్ క్యాప్సిల్స్ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. చివరిగా మనం ఇందులో యాడ్ చేసుకునే ఇంగ్రిడియంట్స్ ఏంటంటే ఆవాల నూనె మీకు ఆవాల నూనె రెండు రకాలుగా దొరుకుతుంది.

మీకు ఏది అవైలబుల్ గా అనుకుంటే అది తీసుకోండి. ఈ ఆయిల్ వచ్చేసి మనకి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి వీటన్నింటినీ బాగా కలపండి. తొందరగానే తయారు చేసుకోవచ్చు.. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం.. ముందుగా మీ స్కాల్స్ భాగమంతా పట్టించండి.. అప్లై చేసిన తర్వాత ఏమైనా మిగిలితే హెయిర్ అంతటికి అప్లై చేయవచ్చు..ఇలా మీరు అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచుకుని మీరు మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా వారానికి మీరు రెండు సార్లు చొప్పున అప్లై చేస్తూ ఉంటే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది. మీకు హెయిర్ ఫాలింగ్ చక్కగా తగ్గిపోతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది