పులిపిర్లు శాశ్వతంగా పోవాలంటే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

పులిపిర్లు శాశ్వతంగా పోవాలంటే..

శరీరంపై పులిపిర్లు చాలా మందికి ఉంటాయి. ఇది చాలా మందికి ఇబ్బందిని తెచ్చి పెడతాయి. పులిపిర్ల వల్ల ఎలాంటి నొప్పి, దురద, అలెర్జీ లాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా.. అవి ముఖం మీద కనిపిస్తే చాలా మందికి నచ్చదు. వాటిని తొలగించుకోవాలని చాలా మంది అనుకుంటారు. వాటిని తీసేందుకు హోం రెమెడిస్‌ వాడతారు. సున్నం, పసుపు లాంటివి వాటికి పెడతారు. ఇలాంటివి చేయడం వల్ల దురద పుడుతుంది. కొన్ని సార్లు పులిపిర్లు పగిలిపోయి చీము వస్తుంది. అది […]

 Authored By pavan | The Telugu News | Updated on :26 February 2022,6:00 am

శరీరంపై పులిపిర్లు చాలా మందికి ఉంటాయి. ఇది చాలా మందికి ఇబ్బందిని తెచ్చి పెడతాయి. పులిపిర్ల వల్ల ఎలాంటి నొప్పి, దురద, అలెర్జీ లాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా.. అవి ముఖం మీద కనిపిస్తే చాలా మందికి నచ్చదు. వాటిని తొలగించుకోవాలని చాలా మంది అనుకుంటారు. వాటిని తీసేందుకు హోం రెమెడిస్‌ వాడతారు. సున్నం, పసుపు లాంటివి వాటికి పెడతారు. ఇలాంటివి చేయడం వల్ల దురద పుడుతుంది. కొన్ని సార్లు పులిపిర్లు పగిలిపోయి చీము వస్తుంది. అది మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. పులిపిర్లు అంటే పాపిల్లోమా వైరస్‌ వల్ల కలిగే హాని చేయని చర్మ పెరుగుదల. అధ్యయనాల ప్రకారం వైరస్‌ ముఖం, జననాంగాలు మరియు చేతులపై పులిపిర్లు కనిపించడానకి కారణమవుతాయి.

వీటికి వివిధ రకాల పులిపిర్ల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పులిపిర్లు రకం మరియు స్థానం ఆధారంగా అవి ప్రభావం మారుతూ ఉంటుంది. పులిపిర్లు కొన్ని నొప్పి లేనివి, కొన్ని నొప్పితో కూడినవి ఉంటాయి. నొప్పి లేని వాటిని సాధారణ చిట్కాలు ద్వారా నివారించుకోవచ్చు. నొప్పితో కూడిన పులిపిర్లను డాక్టర్ల సలహాతో పరీక్ష చేయించుకోవడం మంచిది. కోన్ని రకాల చిట్కాలను ఉపయోగిస్తే పులిపిర్లు రాలిపోయినా.. ఆ ప్రాంతంలో రక్తం కారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. పులిపిర్లకు అనేక ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నా.. ఇవి ప్రభావవంతంగా పని చేసినా.. ఆ ప్రదేశంలో చిన్న పాటి మచ్చలు వస్తాయి. అలా కాకుండా హోమియో పతి మందుల ద్వారా కూడా వీటిని ఈజీగా తగ్గించుకోవచ్చు. మంచి హోమియో డాక్టర్ ఇచ్చే మందులు కొన్ని రోజుల్లోనే పులిపిర్లు రాలిపోవడానికి సహాయపడతాయి.

home remedy for remove warts

home remedy for remove warts

మనం తినే ఆహారంలో తాజా పచ్చి కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా కూడా వీటిని తగ్గించుకోవచ్చు. దీని వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడి పులిపిర్లు వాటికవే రాలిపడి జీవితంలో రాకుండా శరీరం తనను తాను రక్షించుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లు, ఆకు కూరల్లో కాల్షియం మరియు శక్తిమంతమైన విటమిన్ బితో సమృద్ధిగా ఉంటాయి. బ్రకోలీ, క్యారెట్‌, టొమాటోలు, చెర్రీస్ మరియు బ్లూ బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి విటమిన్ సి ఉన్న పండ్లను తీసుకోవాలి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది