Honey : తేనెతో కలిపి వీటిని అస్సలు తినకూడదు… తింటే అది విషయమే అవుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Honey : తేనెతో కలిపి వీటిని అస్సలు తినకూడదు… తింటే అది విషయమే అవుతుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :26 January 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Honey : తేనెతో కలిపి వీటిని అస్సలు తినకూడదు... తింటే అది విషయమే అవుతుంది...!

Honey  : సహజంగా తేనె తీపిని అందించడంతోపాటు మన ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో ఎన్నో విటమిన్స్ మినరల్స్, ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఎన్నో.. కానీ ఈ తేనెను సరైన విధంగా యూస్ చేయకపోతే మన శరీరం పైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. అసలు తేనెను ఏ విధంగా వాడితే విష పదార్థంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎప్పుడూ బాగా వేడిగా ఉండే నీటిలో తేనెను వేసుకుని తాగకూడదు. పొరపాటున అతిగా వేడిగా ఉండే నీటిలో కలిపి త్రాగితే వికారం, కంగారుగా, విరోచనాలు కావడం ఒక్కోసారి వాంతి కూడా అవ్వడం వంటివి జరుగుతుంటాయి…

అలాగే తేనెను వేడివేడి ఆహారంలో కూడా వేసుకోకూడదు. తేనే మనకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. దానిని మనం న్యాచురల్ గా సేవించాలి తప్ప వేడి చేయకూడదు. అలా వేడి చేస్తే విషంలా మారి హెల్త్ ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేస్తుంది. తేనెను ఎప్పుడూ ముల్లంగి రసంలో కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే అది విషంలా మారి శరీర అవయవాలకు హాని కలిగిస్తుంది. ఎప్పుడైనా వేడి టీ లో కానీ వేడి కాఫీలో కానీ తేనెను కలుపుకొని త్రాగవద్దు. అలా చేస్తే బాడీ టెంపరేచర్ ఎక్కువవుతుంది. ఫలితంగా వికారం కడుపులో మంటగా అనిపిస్తుంది. మాంసంతో కానీ చేపలతో కానీ తేనెను తీసుకోరాదు.

దానివల్ల శరీరం పైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఏ విధమైన ఆయిల్తో తేనెను కలిపి తీసుకోకూడదు. ఎప్పుడూ నెయ్యిని తేనని సమానమైన క్వాంటిటీ తో తీసుకోకూడదు. అలా చేస్తే విష పదార్థంగా మారుతుంది. తేనెను ఎప్పుడు ఫ్రిజ్లో పెట్టకూడదు. దానిని రూమ్ టెంపరేచర్ లోనే ఉంచాలి.. తేనె ఎప్పుడూ పాడవదు. అయితే తేనెను అసలు ఏ విధంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. గోరువెచ్చని పాలల్లో కానీ లేదా గోరువెచ్చని నీటిలో కానీ కలిపి తీసుకోవాలి. లేదా తేనెను డైరెక్ట్గా అలా తీసుకున్న మంచిదే.. కానీ తేనెను రోజుకు రెండు మూడు టీ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది