Health Benefits : గుర్రపు ఆహారం అనే ఈ పప్పులో ఎన్ని ప్రయోజనాలో తెలుసా… దీనిలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Benefits : గుర్రపు ఆహారం అనే ఈ పప్పులో ఎన్ని ప్రయోజనాలో తెలుసా… దీనిలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి..

Health Benefits : గుర్రపు పప్పుగా పిలిచే ఈ పప్పు లో ఎన్నో ప్రయోజనాలు దీనిలో గొప్ప పోషకాలు ఉన్నాయి. ఈ పప్పుని మనం తీసుకోవడం వలన ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. సయాటికా, కీళ్ల నొప్పులు, పక్షవాతం, నడుము నొప్పి ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎన్నో ఔషధాలు ఉన్న ఈ పప్పు పేరు ఉలవలు. ఇది పోషకాల నిధి. […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2023,2:40 pm

Health Benefits : గుర్రపు పప్పుగా పిలిచే ఈ పప్పు లో ఎన్నో ప్రయోజనాలు దీనిలో గొప్ప పోషకాలు ఉన్నాయి. ఈ పప్పుని మనం తీసుకోవడం వలన ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. సయాటికా, కీళ్ల నొప్పులు, పక్షవాతం, నడుము నొప్పి ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎన్నో ఔషధాలు ఉన్న ఈ పప్పు పేరు ఉలవలు. ఇది పోషకాల నిధి. ఆహారంలో ఉలవలను భాగంగా చేసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్లు పరిగడుపున ఉడికించిన ఉలవలు తీసుకోవడం వలన కొవ్వు కరిగి తొందరగా బరువు తగ్గుతారు.. అలాగే బాడీ ఫిట్గా తయారవుతుంది. కొలెస్ట్రాల్, కిడ్నీలో రాళ్లు, లాంటి ఎన్నో వ్యాధుల్ని తరిమికొట్టే గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఈ ఉలవలను నిత్యం తీసుకునే వాళ్ళు ఇతరుల కన్నా చాలా స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉంటారు. అని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Horse feed Health Benefits nutrients in this Horse Feed

Horse feed Health Benefits nutrients in this Horse Feed

ఎదిగే పిల్లలకు ఉలువలు ఎంతో ముఖ్యమైన ఆహారంగా పెట్టవచ్చు. దీనిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వలన రక్తహీనత, నీరసం తగ్గిపోతుంది. అలాగే పురుషులు లైంగిక సామర్థ్యం పెంచే గుణం ఉలవలకి ఉంది.. జ్వరంతో బాధపడేవాళ్లు ఉలవల కషాయాన్ని పెసరపప్పుతో కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గు లాంటి సీజనల్ వ్యాధులతో పోరాటానికి చాలా సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఉదర సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉలవలు తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. నిత్యం 100 గ్రాములు ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పోషకాల లోపం తగ్గిపోతుంది. ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉండదు.

ఉలవల కషాయాన్ని పాలల్లో కలుపుకొని తీసుకోవడం వలన నులిపురుగులు చచ్చిపోతాయి. అలాగే ఫైల్స్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఉలువలు తీసుకోవడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉలవలు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాములు ఉలవలలు 22 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. ఇది జీవ క్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది. శరీర బరువుని నియంత్రణలో ఉంటుంది. వీటిని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే స్త్రీలలో రుతుక్రమ సమస్యలు తగ్గిస్తుంది. తరచుగా ఉలవచారును ఆహారంలో తీసుకోవడం వలన నడుము నొప్పి, పక్షవాతం, సయాటికా కీళ్ల నొప్పులు లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది