Suger : మనం రోజుకు ఎన్ని స్పూన్ల చక్కెరను తీసుకోవాలి… అంతకు మించితే ఎలాంటి సమస్యలు వస్తాయి…!
ప్రధానాంశాలు:
Suger : మనం రోజుకు ఎన్ని స్పూన్ల చక్కెరను తీసుకోవాలి... అంతకు మించితే ఎలాంటి సమస్యలు వస్తాయి...!
Suger : మన రోజు వారి జీవితంలో చక్కెరను ఎక్కువ గా తీసుకుంటూ ఉంటాం. అయితే టీలో చెక్కరను నియంత్రించడం వల్ల డయాబెటిస్ ప్రమాదాలను తగ్గించవచ్చు అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. అయితే మనం ఒక్క టీలో మాత్రమే కాక చక్కెరను నిత్యం ఇతర మార్గాలలో వాడుతుంటాం. వీటన్నిటిలో కూడా చక్కెర ను కలుపుతారు. కావున మనం తీపి పదార్థాలను తగ్గించినప్పటికీ చక్కెరను పూర్తిగా ఆపడం అనేది సాధ్యం అయ్యే పని మాత్రం కాదు. నిజానికి చక్కెరను పూర్తిగా తీసుకోవడం అస్సలు ఆపకూడదు. అందుకని షుగర్ అధికంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకోకూడదు. ఇది బరువును పెంచేందుకు కూడా దారి తీస్తుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలకు ఎంతో దూరంగా ఉండాలి.
చక్కెర ఉన్నటువంటి పానీయాలను అనగా శీతల పానీయాలను పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే కృత్రిమ చక్కెర మధుమేహం మరియు క్యాన్సర్ లాంటి దీర్ఘ కాలిక సమస్యల ప్రమాదాలను కూడా పెంచగలదు. అందువల్ల చక్కెర ను పూర్తిగా వాడకుండా ఆపడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కావున దీనిని పరిమిత మోతాదులో తీసుకుంటే ప్రమాదం అనేది ఉండదు. అయితే మనం రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి అనే విషయంలో నిర్దిష్ట కొలతలు అనేవి ఉంటాయి. దానికి కట్టుబడి ఉంటే చాలు.

Suger : మనం రోజుకు ఎన్ని స్పూన్ల చక్కెరను తీసుకోవాలి… అంతకు మించితే ఎలాంటి సమస్యలు వస్తాయి…!
అయితే మనం రోజుకు ఎంత చక్కరను తీసుకోవాలి అనేది మన జీవనశైలి మరియు శారీరక స్థితి పైనే ఆధారపడి ఉంటుంది. అయితే చక్కెరలో కేలరీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కావున చక్కెరను తెలికగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మన రోజువారి కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు శారీరకంగా చురుకుగా ఉండేందుకు కేలరీలు అనేవి ఎంతో ముఖ్యం. కావున ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు అవసరమైన కెలరీలలో 10% చక్కెర చాలా అవసరం. కావున మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు రోజుకు ఎన్ని స్పూన్ల చక్కెర ను తీసుకోవాలో మీరే నిర్ణయించుకోండి. అలాగే రోజుకు 3 నుండి 5 స్ఫూన్ల కంటే ఎక్కువ చక్కెర ను తీసుకోకూడదు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది…