Blood Pressure : బీపీ చెక్ చేసుకునే ముందు ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి..!
Blood Pressure : బీపీ.. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది ఎక్కువైనా సమస్యే.. తక్కువైనా సమస్యే. హైబీపీ ఉన్నా లోబీపీ ఉన్నా చాలా సమస్యలు వస్తాయి. అందుకే.. బీపీ ఎప్పుడూ నార్మల్ గా ఉండేలా చూసుకోవాలి. హైపర్ టెన్షన్ తో బాధపడేవాళ్లకు హైబీపీ వస్తుంది. ఊరికే కోపం వచ్చేవాళ్లకు కూడా హైబీపీ వస్తుంది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం కూడా బీపీ పెరగడానికి దారి తీస్తుంది. అయితే.. హైపర్ టెన్షన్ తో బాధపడేవాళ్లు ఖచ్చితంగా బీపీని క్రమం తప్పకుండా ట్రాక్ చేసుకోవాలి. అలా అయితేనే వాళ్ల ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే.. లేనిపోని సమస్యలు వస్తుంటాయి.
కొందరికి అన్నం తిన్న తర్వాత బీపీ తగ్గుతుంది. అన్నం తిన్న తర్వాత రక్తం.. తిన్న ఆహారాన్ని డైజెస్టివ్ ట్రాక్ట్ లోకి పంపిస్తుంది. అప్పుడు బీపీ తక్కువవుతుంది. అందుకే.. అన్నం తినగానే బీపీ చెక్ చేసుకోవద్దు. అప్పుడు కరెక్ట్ రీడింగ్ చూపించదు. అన్నం తిన్న తర్వాత కనీసం ఓ గంట ఆగి.. బీపీ చెక్ చేసుకోవడం మంచిది. అన్నం తినగానే.. గుండె వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం… బ్లడ్ ప్రెజర్ వేరే అవయవాలకు చేరడం వల్ల.. గుండె వేగం పెరుగుతుంది.
Blood Pressure : బీపీ చెక్ చేసే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి
బీపీ రీడింగ్ తీసుకునే ముందు.. అస్సలు సిగిరెట్ తాగకూడదు. ఆల్కాహాల్ తీసుకొని బీపీ చెక్ చేసుకోకూడదు. అలాగే.. బీపీ చెక్ చేసుకునే ముందు.. బ్లాడర్ ఖాళీగా ఉండాలి. కాళ్లను ఒక దాని మీద మరోటి వేసుకొని బీపీ చెక్ చేసుకోకూడదు. స్ట్రయిట్ గా కూర్చొని.. రెండు కాళ్లను కింద పెట్టుకొని బీపీ చెక్ చేసుకోవాలి. బీపీ రీడింగ్ తీసుకునే ముందు.. అస్సలు టెన్షన్ పడకూడదు. నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80. అంత కంటే ఎక్కువ ఉంటే.. ఎలివేటెడ్ అని అర్థం. 130 / 80 దాటితే.. హైపర్ టెన్షన్ స్టేజ్ లో ఉన్నట్టు అర్థం. 140 దాటితే.. హైపర్ టెన్షన్ స్టేజ్ 2 అని అర్థం. 140 దాటితే.. ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి మెడిసిన్ తీసుకోవాలి. దానికి చికిత్స తీసుకోవాలి. లేకపోతే.. హైబీపీ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి ==> పాలు, పండ్లను కలిపి ఒకేసారి తింటే… ఏమౌతుందో తెలుసా?
ఇది కూడా చదవండి ==> వర్ష కాలంలో వచ్చే ఏ వ్యాధులైన సరే… ఈ ఆరోగ్య చిట్కాలను పాలో అవ్వండి ?
ఇది కూడా చదవండి ==> పొట్టిగా ఉన్నవాళ్లు త్వరగా బరువు తగ్గరా? దానికి కారణం ఏంటో తెలుసా?
ఇది కూడా చదవండి ==> మహిళల కన్నా పురుషులే త్వరగా బరువు తగ్గుతారట.. దానికి కారణం ఏంతో తెలిస్తే నోరెళ్లబెడతారు?