Kalonji Seeds : బరువు తగ్గాలనుకునే వారికి కలోంజి సీడ్స్ బెస్ట్…!
ప్రధానాంశాలు:
Kalonji Seeds : బరువు తగ్గాలనుకునే వారికి కలోంజి సీడ్స్ బెస్ట్...!
Kalonji Seeds : మనకు లభిస్తున్నటువంటి విత్తనాలలో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కలోంజి సీడ్స్ కూడా ఒకటి. ఈ గింజలను తీసుకోవటం వలన బరువు ఎలా తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Kalonji Seeds కలోంజీ లోని పోషకాలు
కలోంజీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి. దీనిలో ఫైబర్, ఆమైనో యాసిడ్స్,ఐరన్, సోడియం, కాల్షియం,పొటాషియం, అధికంగా ఉన్నాయి. ఈ కలోంజీలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి12, నియాసిన్ , విటమిన్ సి లాంటి మిటమీన్స్ ఎక్కువగా ఉంటాయి. అవసరమైనటువంటి కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్,ఖనిజాలు కలిగి ఉండటం వలన కలోంజి ఇతర గింజల కంటే ఎంతో మంచిది. దీనిలో దాదాపు 17 శాతం ప్రోటీన్స్, 26% కార్బోహైడ్రేట్స్, 57% వెజిటేబుల్ ఫ్యాట్స్,ఆయిల్స్ కూడా ఉన్నాయి.
Kalonji Seeds : బరువు తగ్గటం
కలోంజి గింజలు బరువు ను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది.ఈ గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి వలన చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. కలోంజి నీటిలో కొద్దిగా తేనె వేసుకొని ప్రతిరోజు తాగటం వలన బరువులు తగ్గించుకోవచ్చు.దీనికోసం కలోంజీ ని పొడిగా చేసుకొని ఒక చెంచా పొడిని తీసుకొని గోరువెచ్చని నీటిలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగండి. ఈ కలోంజి నీటిని తాగటం వలన ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తుంది.దీని వలన ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేరు. బ్రేక్ ఫాస్ట్ ను తినటం కూడా తగ్గిస్తారు.
Kalonji Seeds : బ్లడ్ షుగర్ లెవెల్స్
బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయటం, బరువు కంట్రోల్ చేసేందుకుకలోంజి ఎంతో ముఖ్యం. కలోంజి రక్తంలోని చక్కెరను కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ నిటిని తాగటం వలన జీవక్రియ రేటు అనేది కూడా పెరుగుతుంది. కలోంజి జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉబ్బరం,అసౌకర్యం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
షుగర్ ఉన్నవారికి : డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. టైపు 2 డయాబెటిస్ లో రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో కలోంజి ఎంతో మేలు చేస్తుంది. టైపు 2 డయాబెటిస్ అనేది మీ శరీరంలోని రక్తంలోని చక్కెరను తగ్గించే విధానాన్ని ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది. షుగర్ ఉన్న వారు ఆశించిన ఫలితాల కోసం పరిగడుపున బ్లాక్ టీ తో పాటుగా కలోంజి నూనెను కూడా తీసుకుంటే చాలా మంచిది.
కొలెస్ట్రాల్ కంట్రోల్ : శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరిగితే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇది గుండెపోటు, అధిక రక్తపోటు, మూత్రపిండ సమస్యలు మరియు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కలోంజి తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి తగ్గుముఖం పడతాయి.
గుండె ఆరోగ్యానికి : కలోంజి విత్తనాలను తీసుకోవటం వలన గుండె ఆరోగ్యం పై కూడా సైడ్ ఎఫెక్ట్ చూపుతుంది. ఇది మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేయటం వలన మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.మంచి ఫలితాల కోసం కలోంజి నునేను పాలతో ప్రతిరోజు తీసుకోవాలి. పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కలోంజి పొడిని తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతుంది…