Kalonji : ఆడవారు కలోంజి సీడ్స్ తీసుకుంటే చాలు… ఈ సమస్యలన్నీ మాయం…!
ప్రధానాంశాలు:
Kalonji : ఆడవారు కలోంజి సీడ్స్ తీసుకుంటే చాలు...ఈ సమస్యలన్నీ మాయం...!
Kalonji : కలోంజి సీడ్స్ జీలకర్ర లో ఒక రకమైనది. అయితే వీటిని నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తుంటారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ గింజలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఒమేగా త్రీ, విటమిన్స్ ఏ, సి, బి12, ఫ్యాటీ యాసిడ్స్,ఫైబర్, కాల్షియం,ఐరన్,ఫాస్పరస్ లాంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ఈ కలోంజీ సీడ్స్ తీసుకోవడం వల్ల ఆడవారికి ఎన్నో లాభాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వలన లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలోంజీ సీడ్స్ తీసుకోవడం వలన లివర్ అనేది ఎంతో బలంగా తయారవుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా చురుగ్గ మారి నొప్పులను నియంత్రిస్తుంది. దీనిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. అలాగే షుగర్, హై బిపి, క్యాన్సర్ లాంటి ప్రమాదాలను కూడా దూరం చేస్తుంది. అలాగే ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆడవారికి ఈ కలోంజీ సీడ్స్ ఎంతో మంచిది.
అయితే వీటిని ప్రతినిత్యం తీసుకున్నట్లయితే కడుపులో మంటను నియంత్రిస్తుంది. అలాగే నొప్పిని కూడా నియంత్రిస్తుంది. అయితే ప్రెగ్నెంట్ కావాలి అనుకునే ఆడవారికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పునరుత్పత్తి వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా చేసి సంతానోత్పత్తిని పెంచే యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దీనిలో అధికంగా ఉన్నాయి. అలాగే బరువును నియంత్రించడంలో కూడా ఈ సీడ్స్ అనేవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇవి జీవక్రియను అదుపులో ఉంచి ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇవి ఇన్సులిన్ సేన్సిటీవీటిని కూడా పెంచుతాయి. అలాగే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ నియంత్రించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఈ కలోంజి సీడ్స్ అనేవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అలాగే అతిగా తినాలని కోరికను కూడా నియంత్రిస్తుంది. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కూడా ఎంతో మెరుగ్గ చేస్తుంది. అలాగే హెల్తీ వెయిట్ ను కూడా మెయింటెన్ చేస్తాయి.
ఈ కలోంజీ సీడ్స్ ని తీసుకోవడం వలన హార్మోన్ల అసమతుల్యతను బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే ప్రతినిత్యం పీరియడ్స్ లేని వారికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. దీనితోపాటుగా మోనోపాజ్ సమయంలో వచ్చే కొన్ని సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక హార్మోన్స్ ను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే మానసిక సమస్యలు మరియు ఇన్ రెగ్యులర్ పీరియడ్ సమస్యలను కూడా నయం చేయగలదు. ఈ కలోంజి సీడ్స్ లో సూర్యడు నుండి వచ్చే కిరణాల నుండి మన చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. ఈ కలోంజి సీడ్స్ తో తయారు చేసినటువంటి నూనెను జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు కుదళ్లను బలంగా చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ నూనె ప్రతినిత్యం తీసుకోవడం వలన జుట్టు రాలడం తగ్గి పొడవుగా పెరుగుతుంది. ఈ కలోంజీలో చర్మాన్ని రక్షించే గుణాలు కూడా ఉన్నాయి. అలాగే అకాల వృద్ధాప్య సంకేతాలను నియంత్రించే అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్ వలన వచ్చే దురద,పొక్కులు, దద్దుర్లు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది…