Yoga for Womens : మహిళలు ఈ ఐదు యోగ సనాలు చేస్తే చాలు… పీరియడ్స్ టైం లో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు…!!
Yoga for Womens : స్త్రీలు తమ రోజువారి జీవితంలో భాగంగా యోగాను కచ్చితంగా చేర్చుకోవాలి. అయితే ప్రతిరోజు కూడా బద్ధ కోనాసనం కచ్చితంగా చెయ్యాలి. ఈ ఆసనాన్ని చేయటం వలన మహిళలు పీరియడ్స్ టైం లో వచ్చే సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. దీనితో పాటుగా మహిళలకు పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ యోగాసనం అనేది పునరుత్పత్తి అవయవాల కండరాలను బలంగా చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మహిళలు తమ జీవిత కాలంలో ఎన్నో హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సంభావ్యత అధికంగా ఉంటుంది. అలాగే మలాసానాన్ని నిత్యం ప్రాక్టీస్ చేయడం వలన హార్మోన్ల అసమతుల్యత అనేది తగ్గుతుంది. అంతేకాక ఈ ఆసనం ద్వారా జీవక్రియ కూడా ఎంతో మేరుగుపడుతుంది. అలాగే ఇది బరువును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాక చీలమండలు మరియు మోకాళ్లు కూడా ఎంతో బలంగా తరువుతాయి. అలాగే కంటి ప్రాంతంలో ఉన్న కండరాలు కూడా బలంగా తయారవుతాయి…
పవన్ముక్తాసనం చేయడం వలన స్త్రీల యొక్క పునరుత్పత్తి అవయవాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది మాత్రమే కాక బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో గ్యాస్ సమస్య నుండి ఉపసమనాన్ని అందించడంలో కూడా మేలు చేస్తుంది. అయితే నిత్యం పవన్ముక్తాశనం చేయడం వలన నడుము మరియు వెన్నుముక, చేతులు, కాళ్ళ కండరాలు అనేవి సాగుతాయి. అలాగే నిత్యం హాల్పాహారం చేయడం వలన పీరియడ్స్ టైం లో పెల్విక్ ప్రాంతంలో వచ్చే తిమ్మిర్లు అనేవి తగ్గుతాయి. ఈ యోగా ఆసనం అనేది చర్మాన్ని యవ్వనంగా ఉంచటంలో కూడా మేలు చేస్తుంది…
హలాసాన భంగిమ అనేది వెన్నుముకను అనువైనదిగా చేస్తుంది. అలాగే అలసట మరియు ఒత్తిడి, గోడ తిమ్మిరి, మలబద్దకం, గ్యాస్, బొడ్డు కొవ్వు లాంటి వాటిని కూడా నియంత్రిస్తుంది. అలాగే హానుమానాసనం కూడా స్త్రీలకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో నడుము మరియు పొట్ట కొవ్వు అనేది తగ్గుతుంది. ఈ యోగాసనం చేయడం వలన కండరాలు కూడా ఎంతో బిగుతుగా తయారవుతాయి. ఈ ఆసనం అనేది పిరియడ్స్ కు సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే సయాటికా నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే చేతులు మరియు కాళ్లు కండరాలను బలంగా చేయడం తొడలు మరియు మోకాళ్ళ కండరాలను సాగదీయడం లాంటి ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి…