Tea : ఖాళీ కడుపుతో పొద్దున్నే టీ, కాఫీలు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : ఖాళీ కడుపుతో పొద్దున్నే టీ, కాఫీలు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!

 Authored By aruna | The Telugu News | Updated on :7 September 2023,7:00 am

Tea : ఖాళీ కడుపుతో పొద్దున్నే టీ కాఫీ తాగుతున్నారా.. అయితే నీ శరీరంలో జరిగే ప్రమాదాలు ఇవే.. ఖాళి కడుపుతో టీ తాగటం వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అలాంటి సంఘటనల గురించి మీకు మేము వివరంగా చెప్పబోతున్నాం. ఖాళీ కడుపుతో టీ తాగితే ఎటువంటి అనర్ధాలు ఉంటాయో ఈ విషయాలు తెలిస్తే అర్థమవుతుంది. మరి ఇంకెప్పుడూ కూడా మీరు ఖాళీ కడుపుతో టీ తాగరు. మీకు టీ తాగాక ఆకలి వేయదు కదా.. టీ తాగాక కడుపులో తిప్పినట్లు ఉంటుందా? టీ తాగాక మీ ఒంట్లో వేడి పెరిగినట్టు అనిపిస్తుందా.. మన దేశంలో దాదాపు అందరూ ఉదయం లేచిన వెంటనే టీ తాగటం మన దినచర్యలో ఒక భాగం. కాళీ కడుపుతో టీ తాగడం వలన మీ శరీరానికి ఎంత హాని చేస్తుందో మీకు తెలుసా? మీరు ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు మీ ఆరోగ్యం పై ఇలా ప్రభావం చూపుతుంది.

ఖాళీ కడుపుతో టీ అసలు తాగకండి. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులోని ఆమ్లా మరియు ఆల్కలీం ఏర్పడుతుంది. మీ జీవ క్రియ వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. ఇది శరీరంలోని సాధారణ జీవక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. మరియు ఎక్కువ శారీరక సమస్యలను కలిగిస్తుంది. టీ తాగటం వల్ల దంతాలు పాడవుతాయి. అవును ఉదయాన్నే టీ తాగడం వల్ల మీ దంతాలపై ఎనామిల్ దెబ్బతింటుంది. నోటిలోని బ్యాక్టీరియా చెక్కరను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఇది నోటిలోని ఆమ్ల పదార్థాల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది చివరికి మీ దంతాల సమస్యకు కారణం అవుతుంది. ఇది మీ శరీరం నుండి నీటిని తొలగిస్తుంది. మీరు ఉదయం నిద్ర లేవడానికి ముందు సుమారు 8 గంటలు నీరు లేకుండా నిద్రపోతున్నప్పుడు మీ శరీరం ఇప్పటికే నిజిలీకరణానికి గురవుతుంది.

If you are drinking tea and coffee in the morning

Tea : ఖాళీ కడుపుతో పొద్దున్నే టీ, కాఫీలు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!

దానికి తోడు నిద్రలేవగానే టీ తాగినప్పుడు ఇది అధిక డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది. మరియు కండరాల తిమ్మిరి కి దారితీస్తుంది. కడుపు ఉబ్బరంగా మారే ప్రమాదం చాలామంది జరుగుతుంది. ఖాళీ ప్రేగులను ప్రభావితం చేస్తుంది. రాత్రి మరియు ఉదయం మధ్య మీ కడుపు ఖాళీగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఉదయం నిద్ర లేచిన తర్వాత పరగడుపున టీ తాగడం వల్ల మీ కడుపులోని వైద్య రసం చర్యను ప్రభావితం చేస్తుంది.దీని వలన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ ప్రభావాలు ఆందోళన మరియు నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలకు దారి తీస్తాయి.

మీరు ఉదయం టీ తాగాలని ఆలోచిస్తుంటే మీరు అల్పాహారం తీసుకున్న తర్వాత త్రాగండి. గ్రీన్ టీ సహజంగా ఇనుమును పీల్చుకునే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అందువల్ల రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు కేవలం పరకడుపుతో టీ తాగకూడదు. ఎందుకంటే ఇది ఇతర ఆహార వనరు నుండి శరీరంలో ఇనుము తగ్గిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది