Green Tea : రాత్రి నిద్ర పట్టడం లేదా… అయితే, ఈ టీ తాగండి… ప్రశాంతంగా నిద్రిస్తారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Tea : రాత్రి నిద్ర పట్టడం లేదా… అయితే, ఈ టీ తాగండి… ప్రశాంతంగా నిద్రిస్తారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Green Tea : రాత్రి నిద్ర పట్టడం లేదా... అయితే, ఈ టీ తాగండి... ప్రశాంతంగా నిద్రిస్తారు...?

Green Tea : సాధారణంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో ఇది సాధ్యం కావడం లేదు. ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ లో నిద్రపోయే సమయాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. కనీసం రోజుకి 8 గంటలు నిద్ర సరైనది.కానీ ఈరోజుల్లో అది సాధ్యం కావడం లేదు. 6, 5 గంటలు మాత్రమే నిద్రించే వారు కూడా ఉన్నారు.ఇలా కనుక నిద్రిస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే, కొంతమందికి ఎంత ప్రయత్నించినా ప్రశాంతమైన నిద్ర రాదు. ఇలాంటి వారు రాత్రి సమయంలో గ్రీన్ టీ తీసుకుంటే, శరీరానికి విశ్రాంతి,మానసిక ప్రశాంతి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రీన్ టీ ఒత్తిడిని తగ్గించడంతోపాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది ఇంకా ఆరోగ్యం కరమైన నిద్ర పోవాలంటే ఇది సహజమైన మార్గం. ఉదయం లేవగానే శరీరం శక్తివంతంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. తీసుకునే ఆహారం, తీసుకునే ద్రవాలు కూడా కీలకపాత్రను పోషిస్తాయి. రోజంతా శక్తివంతంగా ఉండాలంటే రాత్రి ప్రశాంతమైన నిద్ర పోవాలి. నిద్ర సరిగా పట్టాలంటే గ్రీన్ టీ తప్పనిసరిగా తాగండి. రోజంతా అలసిపోయిన శరీరానికి మంచి నిద్ర రావాలంటే, రాత్రి సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తాగితే శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. అంతే కాదు,మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంకా, దీని ప్రభావం ఆరోగ్యం పై కూడా ఎన్నో విధాలుగా ప్రభావం చూపుతుంది.

Green Tea రాత్రి నిద్ర పట్టడం లేదా అయితే ఈ టీ తాగండి ప్రశాంతంగా నిద్రిస్తారు

Green Tea : రాత్రి నిద్ర పట్టడం లేదా… అయితే, ఈ టీ తాగండి… ప్రశాంతంగా నిద్రిస్తారు…?

Green Tea : ఒత్తిడి తగ్గుతుంది

టీ తాగితే ఎల్ థియనిన్ అనే ప్రకృతిలో సహజంగా లభించే అమైనో ఆమ్లం మెదడును శాంత పరుస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.ఆందోళన భయం నియంత్రించబడుతుంది. రాత్రిపూట ఈ గ్రీన్ టీ తాగితే వెంటనే నెమ్మదిగా మానసిక విశ్రాంతి కలిగి మంచి నిద్ర కలుగుతుంది.

అధిక బరువు : గ్రీన్ టీ జీవ క్రియను మెరుగుపరుస్తుంది. రాత్రి తాగితే శరీరంలో కొవ్వు ఇట్లే కరిగిపోతుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వు కణాలపై ప్రభావం చూపుతుంది.తక్కువ నిల్వయేలా చేస్తుంది.కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ తాగితే జీవక్రియ వేగవంతం 4% వరకు పెరుగుతుందని గుర్తించారు.

గుండె ఆరోగ్యం : గ్రీన్ టీ తాగితే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నివేదించింది. రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించి, ఆరోగ్యకరమైన లిపిడ్ స్థాయిలను ప్రోత్సహిస్తుంది. జపాన్లో జరిగిన ఒక అధ్యాయంలో రోజుకు 5 కప్పుల గ్రీన్ టీ తాగితే గుండెపోటు స్ట్రోక్ లు వచ్చే అవకాశాలు ఘననీయంగా తగ్గుతాయని కనుగొన్నారు.

ప్రశాంతవంతమైన నిద్ర : నిద్రలేని సమస్యలు చాలామందిని వేధిస్తున్న సమస్య.గ్రీన్ ఒక సహజ నివారణంగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని అందిస్తుంది. ఇందులో ఉండే ఎల్ థియనిన్ హార్మోన్లు సమతుల్యం చేసి మెదడును ప్రశాంత పరుస్తుంది. దీనివల్ల నిద్ర గాఢంగా, నిరాటకంగా పడుతుంది. వాతావరణం లో గ్రీన్ టీ తాగితే శరీరానికి చాలా హాయిగా మంచి అనుభూతిని ఇస్తుంది.ముఖ్యంగా, రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే, శరీరానికి విశ్రాంతిని మానసిక ప్రశాంతతను ఇంకా జీవక్రియ మెరుగుపడుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది