Qualities : ఈ 5 లక్షణాలు ఉంటే మీకు ప్రేమ గౌరవం లభించడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Qualities : ఈ 5 లక్షణాలు ఉంటే మీకు ప్రేమ గౌరవం లభించడం ఖాయం...!
ప్రతి వ్యక్తి తన జీవితంలో సంతోషంగా ఉంటూ సమాజంలో గౌరవం లభించాలని కోరుకుంటాడు. మరికొందరైతే జీవితం ప్రతిష్ట గౌరవ మర్యాదల కోసం పోరాడుతారు. అలాంటి వారి కోసం ఆచార చాణిక్యుడు కొన్ని సలహాలను ఇచ్చాడు. సమాజంలో గౌరవం సంపాదించడం అంత సులభంగా ఉండదు. ప్రేమ గౌరవం మర్యాదలు వచ్చినప్పటికీ ఇతరుల నుండి డిమాండ్ వస్తే నవ్వులపాలవుతారు. ఇటువంటి పరిస్థితుల్లోనే సమాజంలో గౌరవం ప్రేమ సంపాదించడం కోసం ఈ లక్షణాలు కలిగి ఉండాలని చాణిక్యుడు తెలియజేశారు. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Qualities : ఈ 5 లక్షణాలు ఉంటే మీకు ప్రేమ గౌరవం లభించడం ఖాయం…!
Qualities లక్ష్యంపై దృష్టి పెట్టాలి
జీవితంలో ఏ పని మొదలు పెట్టకుండా కూర్చోవడం అనేది అర్థం లేని పని. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక లక్ష్యం అంటూ తప్పనిసరిగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు ముందుకు వేయాలి. మీ కల పై దృష్టి పెడుతూ ఉంటే స్వయంగా అదే వస్తుంది. దీంతో మీపై అందరి ప్రేమ గౌరవం ఉంటుందని చాణిక్యుడు వివరించాడు.
మీలా మీరు ఉండండి : సమాజంలో గౌరవం లభించాలి అంటే ముఖ్య లక్షణం మీరు మీలా ఉండడం. మిమ్మల్ని పట్టించుకోని వారి గురించి మీరు ఎక్కువగా బాధపడకండి. ఇతర వ్యక్తులకు ఇచ్చే సమయాన్ని మీకే కేటాయించుకోండి. అలాగే మీ యొక్క అవసరాలు మరియు ప్రాధాన్యతల పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. జీవితంలో తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సత్యం ఏమిటంటే నిన్ను నువ్వు తప్ప మరెవ్వరు సంతోష పెట్టలేరు. మీ జీవితంలో మీరు జాగ్రత్తగా ఉంటే సమాజంలో గౌరవం మీకు లభిస్తుంది.
స్వీయ నియంత్రణ ఉండాలి : మీ జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందరి విషయాలలో దూకుడు మంచిది కాదు. ఎందుకంటే ఇతరుల పట్ల అసూయ ప్రతీకార భావాలు కలిగి ఉండడం వలన సమాజంలో మీపై చెడు అభిప్రాయం ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రశాంతంగా ఉంచుకొని అందరికీ మంచి జరగాలని కోరుకునే మనస్తత్వాన్ని పెంచుకోండి.
గౌరవ ఇచ్చి పుచ్చుకోవాలి : ఇతరులకు గౌరవం ఇస్తేనే వారు తిరిగి గౌరవాన్ని పొందుతారు. కనుక ఇతర వ్యక్తులను గౌరవించే లక్షణం కలిగి ఉండాలి. అలాగే ఇతర వ్యక్తులను తక్కువగా చూడడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే మీకు ఎప్పటికీ సమాజంలో గౌరవం లభించదు. ఇలా నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుందని చాణిక్యుడు చెప్పాడు.
ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది : నేటి కాలంలో చాలామంది డబ్బు కోసం కక్కుర్తి పడి ఎన్నో అబద్దాలను చెబుతున్నారు. కానీ జీవితంలో సత్యమార్గం ని అనుసరించే వ్యక్తి సమాజంలో అందరి ప్రేమ అను పొందుతాడు. అలాగే వీరికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. కానీ ఈ సత్యమార్గం చాలా కష్టమైనది.
బాధ్యత తీసుకున్న గుణం కలిగి ఉండాలి : అందరూ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. ఇక కొంతమంది అయితే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దొంగ చాటుగా జారుకుంటారు వారు మన చుట్టూ కూడా ఉండవచ్చు. అదే కుటుంబంలో తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తే ఆ వ్యక్తికి గౌరవం దక్కుతుంది. అయితే ఒక వ్యక్తి తన గుణాల కర్మల ద్వారా గౌరవ ,ప్రేమ పొందగలుగుతాడని ఆచార్య చాణుక్యుడు వివరించాడు.