Mangoes : వామ్మో.. మార్కెట్లోకి వచ్చిన నకిలీ మామిడి పండ్లు… అసలు విషయం ఏంటంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mangoes : వామ్మో.. మార్కెట్లోకి వచ్చిన నకిలీ మామిడి పండ్లు… అసలు విషయం ఏంటంటే…!

Mangoes : వేసవి మనకు ఎక్కువగా దొరికే పండ్ల లో ఒకటి మామిడి పండు కూడా. అయితే ఇవి మార్కెట్లలో ఎంతో విపరీతంగా అమ్ముడు పోతాయి. అయినా కానీ మామిడి పండ్లను బండ్లపై చూడగానే మామిడి ప్రియులు ఎగబడి కొంటూ ఉంటారు. కానీ దానిలో అసలు ఏవి నకిలీవి, ఏవి మంచివి అనేది అస్సలు పట్టించుకోరు. అదేమిటి అంటే. అసలు మామిడి పండ్లలో నకిలీవి కూడా ఉంటాయా అనే సందేహం కలుగుతుంది కదూ. అవును మీరు వెన్నది నిజమే. […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 June 2024,8:00 am

Mangoes : వేసవి మనకు ఎక్కువగా దొరికే పండ్ల లో ఒకటి మామిడి పండు కూడా. అయితే ఇవి మార్కెట్లలో ఎంతో విపరీతంగా అమ్ముడు పోతాయి. అయినా కానీ మామిడి పండ్లను బండ్లపై చూడగానే మామిడి ప్రియులు ఎగబడి కొంటూ ఉంటారు. కానీ దానిలో అసలు ఏవి నకిలీవి, ఏవి మంచివి అనేది అస్సలు పట్టించుకోరు. అదేమిటి అంటే. అసలు మామిడి పండ్లలో నకిలీవి కూడా ఉంటాయా అనే సందేహం కలుగుతుంది కదూ. అవును మీరు వెన్నది నిజమే. మార్కెట్లోకి చాలా నకిలీ మామిడి పండ్లు వస్తున్నాయి. ఈ నకిలీ మామిడి పండ్లు తిన్నవారు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగేలా చేస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడులో ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ఆహార భద్రత విభాగం ఒక గిడ్డంగి నుండి నకిలీ మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా ఏడున్నర టన్నుల నకిలీ మామిడి పండ్లను సీజ్ చేసినటువంటి అధికారులు ఈ పండ్లను తీసుకుంటే ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని తెలిపారు…

నకిలీ మామిడి పండ్లు అనగానే అవి యంత్రాల ద్వారా తయారు అవుతాయి అని అనుకోవద్దు. దాని అర్థం వేరే ఉంటుంది. ఈ మామిడి పండ్లను చెట్ల నుండి కోసి వాటిని కృత్రిమంగా తొందరగా పండించి మార్కెట్ కు తరలిస్తారు. అందువల్ల వీటిని నకిలీ మామిడి పండ్లు అని పిలుస్తారు. అయితే ఈ నకిలీ మామిడి పండ్లను పండించేందుకు కాల్షియం కార్బైడ్ లాంటి వాటిని వాడతారు. అయితే దాని ఉపయోగం అనేది పూర్తిగా నిషేధించారు. ఎందుకు అంటే. వాటి ఆధారంగా పండిన మామిడి పండ్లు మానవ శరీరానికి చాలా ప్రమాదకరం. ఎవరైనా కాల్షియం కార్బైడ్ తో మక్క బెట్టినటువంటి మామిడి పండ్లను తింటే వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని నిపుణులు తెలిపారు…

Mangoes వామ్మో మార్కెట్లోకి వచ్చిన నకిలీ మామిడి పండ్లు అసలు విషయం ఏంటంటే

Mangoes : వామ్మో.. మార్కెట్లోకి వచ్చిన నకిలీ మామిడి పండ్లు… అసలు విషయం ఏంటంటే…!

కాల్షియం కార్బైడ్ అనేది మార్కెట్లో తొందరగా దొరుకుతుంది. ఇది ఒక రకమైన రాయి లా ఉంటుంది. అందుకే దీనిని ప్రజలు సున్నపురాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాల్షియం కార్బెడ్ తో మామిడి పండ్లను పండించేందుకు కార్బైడ్ ను పచ్చ మామిడికాయల మధ్యపెడతారు.అలాగే మామిడికాయల బుట్టలో కాల్షియం కార్బైడ్ చుట్టూ ఈ మామిడి కాయలను ఉంచుతారు. దాని తరువాత వాటిని గోనె సంచులతో కప్పుతారు. అలా ఈ మామిడి పండ్లను మూడు, నాలుగు రోజులు గాలిలేని ప్రదేశంలో ఉంచుతారు. దీని కారణం వలన అవి తొందరగా పండుతాయి. కాల్షియం కార్బైడ్ ను తేమతో సంబంధం లేకుండా ఎసిటిలిన్ అనే వాయువు ఏర్పడుతుంది. ఏ రకమైన పండ్లు అయిన వీటితో ఈజీగా పండుతాయి. ఇలా కాల్షియం కార్బైడ్ తో పండిన మామిడి పండ్లను తీసుకోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. వీటిని తీసుకోవడం వలన కడుపు నొప్పి లాంటి సమస్యలు అనగా విరోచనాలు, వాంతులు, లాంటి సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాక తలనొప్పి,మానసిక ఆందోళన, తల తిరగటం, ముర్చ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి……

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది