Health Tips : వేసవి కాలంలో వడదెబ్బ, డైజేషన్ లాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ రిఫ్రెష్ డ్రింక్ త్రాగాలి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : వేసవి కాలంలో వడదెబ్బ, డైజేషన్ లాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ రిఫ్రెష్ డ్రింక్ త్రాగాలి…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :16 March 2023,8:00 am

Health Tips : వేసవికాలం వచ్చిఅంటే చాలు ఎక్కువగా చల్లటి పానీయాన్ని త్రాగుతూ ఉంటారు అందరూ. అలాగే చల్లగా ఏదో ఒక డ్రింక్ తాగాలి అనిపిస్తూ ఉంటుంది. దానితోపాటు మీ శరీరం కూడా హైడ్రేటు పొందడానికి చల్లటి పానీయాలను కోరుకుంటూ ఉంటుంది. సహజంగా ప్రజలు వేసవిలో జల్జీరా నిమ్మరసం జ్యూస్ లేదా షేక్ తాగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మసాలా జీరాని తాగారా.? అయితే మనం ఈరోజు మసాలా జీరా తయారకి సంబంధించిన రెసిపీని మనం తెలుసుకోబోతున్నాం.. వేసవిలో హీట్ స్ట్రోక్ నుంచి మీ శరీరాన్ని కాపాడడానికి ఉపయోగపడే రిఫ్రెష్ డ్రింక్. దీంతోపాటు మీ జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఈ రుచికరమైన డ్రింక్ తయారు చేయడం కూడా చాలా ఈజీ.

Jeera Masala Soda Recipe Drink summer

Jeera Masala Soda Recipe Drink summer

కావున మసాలా జీరా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ మసాలా జీరా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నల్ల మిరియాలు 12, నల్ల ఉప్పు రుచికి సరిపడేంత, మామూలు ఉప్పు కొంచెం, చక్కెర ఆఫ్ స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, లవంగాలు నాలుగు దంచినవి.. అల్లం అంగుళం జరిగినది. ఎర్ర మిరపకాయలు పొడి చిటికెడు. నిమ్మకాయ ముక్కలు రెండు, ఐస్ బిళ్ళలు అవసరానికి సరిపడే అంత.. ఇక మసాలా జీరా తయారు చేసే విధానం: మసాలా జీరా తయారు చేయడానికి మొదటిగా ఒక గిన్నె తీసుకుని దానిలో జీలకర్ర ను వేయించాలి. తర్వాత దానిలో నుంచి ఒక టీ స్పూన్ జీలకర్ర తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నల్ల మిరియాలు ,లవంగాలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ పదార్థాలన్నిటిని కలిపి బాగా పొడి చేసుకోవాలి.

వడదెబ్బ… తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాత రెండు నిమ్మకాయలను తీసి ఒక గ్లాసులోకి పిండుకొని దానిలో దానిలో చల్లని వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించి పొడి చేసుకున్న మిశ్రమాన్ని దాన్లో కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేరు చేసి పెట్టుకున్న జీలకర్ర కూడా దీనిలో వేసుకోవాలి. తర్వాత కొంచెం వైట్, సాల్ట్ కొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం చాట్ మసాలా కొంచెం పంచదారని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. దాని తర్వాత దానికి ఐస్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక జ్యూస్ గ్లాసులోకి పోసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్ గా మసాలా జీరా డ్రింక్ రెడీ. ఈ వేసవిలో దీన్ని రోజుకి ఒక గ్లాసు తీసుకున్నట్లయితే డైజేషన్ ప్రాబ్లం అలాగే వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది