Piles : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు… ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు…!!
ప్రధానాంశాలు:
Piles : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు... ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు...!!
Piles : ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలతో పాటుగా కొంతమందికి మల విసర్జన చేసే టైం లో రక్తం పడుతుంది. దీనిని పెద్దగా ఎవరు పట్టించుకోరు. అంతేకాక వేడి చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఇది చిన్న విషయం ఏమీ కాదు. అయితే ఇది ఫైల్స్ సమస్య నుండి పెద్ద పేగు క్యాన్సర్ వరకు కూడా ముడిపడి ఉంటుంది. అయితే ఒకటి లేక రెండు సార్లు కంటే ఎక్కువగా మీకు మలంలో రక్తం పడుతూ ఉంటే తప్పనిసరిగా మీరు ఆస్పత్రికి వెళ్లి టెస్ట్ లు చేయించుకోవాలి. ఈ సమస్య అనేది అధికంగా ఉంటే చికిత్స తప్పనిసరి.
అయితే మీకు మొదటిసారిగా మలంలో రక్తం కనిపించినప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య అనేది పెద్దదిగా మారకుండా ఉంటుంది. అలాగే మలంలో రక్తం రాకుండా ఉండాలి అంటే అధికంగా ఫైబర్ ఉండే ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పండ్లు మరియు కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లను అధికంగా తీసుకోవాలి. అంతేకాక నీటిని వీలైనంతవరకు ఎక్కువగా తాగాలి. మీరు నీటిని ఎక్కువగా తాగడం వలన కిడ్నీలు అనేవి క్లీన్ అవుతాయి…
అంతేకాక మలినాలు మరియు విషపదార్థాలు ఏమైనా ఉన్నా సరే అవి కూడా బయటకు పోతాయి. మీకు గనక మలంలో రక్తం కనిపించిన లేక నొప్పిగా ఉన్న మీరు వెంటనే ఆ మలద్వారం చుట్టూ కొబ్బరి నూనె లేక కలబంద గుజ్జును రాసుకోండి. అంతేకాక ఐస్ ముక్కలను ఒక క్లాత్ లో చుట్టుకొని మలద్వారం చుట్టూ కాపడం పెట్టిన కూడా మంచి ఫలితం ఉంటుంది…